MK Stalin : ఎన్ని దాడులు చేసినా భయపడం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. సోమవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తన కేబినెట్ లో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్న కె. పొన్ముడితో పాటు ఎంపీ అయిన తన కుమారుడిపై పెద్ద ఎత్తున ఈడీ దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదంతా కక్ష సాధింపు ధోరణితో జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇది 13 ఏళ్ల కిందట ఆనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో తనపై పెట్టిన తప్పుడు కేసు అని పేర్కొన్నారు. ఈడీ దాడులు బీజేపీని ప్రతిబింబిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్ రవి తన పని తాను చేసుకోవడం లేదన్నారు. పదే పదే తమ సర్కార్ కు అడ్డుపడడమే పనిగా పెట్టుకున్నాడంటూ ఆరోపించారు ఎంకే స్టాలిన్(MK Stalin). ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఏడాదిలో జరగనున్నా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎలా సపోర్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు సీఎం. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
డీఎంకే కానీ దానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా దాడులకు , కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడరని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్. ప్రతిపక్షాలన్నీ ఐక్యం అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు సీఎం. తమిళనాడు, కర్ణాటకల మధ్య వాగ్వాదానికి దారి తీసిన కావేరి సమస్యపై ఇంకా మాట్లాడ లేదన్నారు.
Also Read : ED Raids : మంత్రి, ఎంపీ ఇళ్లల్లో రూ. 60 లక్షలు