ED Raids : మంత్రి, ఎంపీ ఇళ్ల‌ల్లో రూ. 60 ల‌క్ష‌లు

కొడుకు ఇళ్ళ స్థ‌లాల్లో ఈడీ దాడులు

ED Raids : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. త‌మిళ‌నాడు పై ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే మంత్రి సెంథిల్ బాలాజీనీ జాబ్స్ స్కాంకు పాల్ప‌డిన ఆరోప‌ణ‌లకు సంబంధించి అరెస్ట్ చేసింది. సోమ‌వారం ఉన్న‌ట్టుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్త‌రి పొన్ముడితో పాటు ఆయ‌న కొడుకుపై ఏక కాలంలో దాడుల‌కు దిగింది. ఇద్ద‌రి వ‌ద్ద రూ. 10 ల‌క్ష‌ల విదేశీ క‌రెన్సీతో పాటు రూ. 60 ల‌క్ష‌ల స్వ‌దేశానికి చెందిన న‌గ‌దు ల‌భ్య‌మైనట్లు స‌మాచారం.

ఇవాళ తండ్రీ కొడుకుల‌కు సంబంధించి త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైతో పాటు విల్లుపురంలోని ప‌లు ప్రాంతాల‌లో దాడులు చేప‌ట్టింది ఈడీ(ED). మంత్రి పొన్ముడితో పాటు కొడుకు గౌతం సిగ‌మ‌ణి నివాసాల‌పై రైడ్స్ జ‌రిగాయి. 72 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన కె. పొన్ముడి విల్లుపురం జిల్లా లోని తిరుక్కోయిలూర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక కొడుకు క‌ల్ల‌కురిచ్చి స్థానానికి ఎంపీగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా 2007 నుండి 2011 దాకా మైనింగ్ శాఖా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో క్వారీ లైసెన్సుల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రూ. 28 కోట్ల మేర ఖ‌జానాకు న‌ష్టం వాటిల్లినట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా మంత్రితో పాటు ఎంపీ కి సంబంధించిన బంధువులు, స‌న్నిహితుల‌పై కూడా ఈడీ ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు దాడులు చేప‌ట్టింది.

Also Read : Tirumala Tickets : 18న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల‌

 

Leave A Reply

Your Email Id will not be published!