MK Stalin : బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు వర్సెస్ సీఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో సీఎం దీదీ గవర్నర్ , తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ తమిళిసై , కేరళలో సీఎం, గవర్నర్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గమనేలా జరుగుతోంది.
తాజాగా తమిళనాడులో గవర్నర్ రవి, సీఎం ఎంకే స్లాలిన్ (MK Stalin)మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. గవర్నర్ సామంత రాజు లాగా ఫీల్ అవుతున్నారంటూ మండిపడ్డారు.
నీట్ వ్యతిరేక బిల్లుపై సీఎం, గవర్నర్ల మధ్య యుద్దం కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు భారీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
బిల్లు సందర్భంగా గవర్నర్ ఆర్. ఎన్. రవిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం కోరడం లేదన్నారు. అయితే రాష్ట్రపతి ఆమోదం కోసం పోస్ట్ మ్యాన్ లా పంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడుకు జాతీయ ప్రవేశ – పరీక్ష (నీట్) నుంచి మినహాయింపు కోరుతూ డీఎంకే హయాంలో రెండు సార్లు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లకు ఆమోదం తెలిపే అధికారం గవర్నర్ కు లేదన్నారు స్టాలిన్.
ద్రవిడ కజగం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చామని, నీట్ ను తొలగించేందుకు తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు.
ఇదిలా ఉండగా స్టాలిన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : చాలీసా పేరుతో దాదాగిరి చేస్తే ఊరుకోం