MLA Bojjala : త్వరలో ఆ ముగ్గురు వైకాపా నేతలు జైలు మెట్లెక్కడం కాయం

మరో మూడు రోజుల్లోనే ముగ్గురు వైసీపీ నాయకులు జైలుకు వెళ్లబోతున్నారన్నారు...

MLA Bojjala : వైసీపీ అక్రమార్కులను త్వరలోనే జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్ల జాబితాను విడుదల చేసిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తిలో కొందరు వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు సాగించిన దుర్మార్గాలను వెలికి తీస్తున్నట్లు చెప్పారు.

MLA Bojjala Comments

మరో మూడు రోజుల్లోనే ముగ్గురు వైసీపీ నాయకులు జైలుకు వెళ్లబోతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణానికి మనోజ్‌కుమార్‌ను 94917 06316 నెంబరులో సంప్రదించాలని సూచించారు. అలాగే శ్రీకాళహస్తి మండలానికి మణెమ్మ (70321 78191), తొట్టంబేడుకు భారతి (91820 31426), ఏర్పేడుకు హేమ (94418 55838), రేణిగుంటకు సుజాత (83670 90320)ను నియమించామన్నారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. పలువురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెంచయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Also Read : CM Chandrababu : విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

Leave A Reply

Your Email Id will not be published!