MLA Harish Rao : బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై మాజీ మంత్రి ఘరమ్
ఈ మేరకు ఓప్రకటన విడుదల చేశారు...
Harish Rao : బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేశారు.ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర లేపడం దుర్మార్గమని అన్నారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని చెప్పారు. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు(Harish Rao) డిమాండ్ చేశారు.
MLA Harish Rao Slams
కాగా..బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం ప్లెక్సీలు చించివేశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ భువనగిరిలో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. పలువురు నేతల ముందస్తు హౌజ్ అరెస్టు చేశారు.హైదరాబాద్ బోడుప్పల్లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హౌజ్ అరెస్టు చేశారు.కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత హౌజ్ అరెస్టు చేశారు.
Also Read : Rajiv Arogyasri : ఆరోగ్యశ్రీ సేవళిక బందంటున్న నెట్ వర్క్ ఆసుపత్రులు