MLA Rachamallu Siva Prasad Reddy: వైసిపి ఎమ్మెల్యే పోన్ హ్యాక్ ? ఎస్పీకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే !

వైసిపి ఎమ్మెల్యే పోన్ హ్యాక్ ? ఎస్పీకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే !

MLA Rachamallu Siva Prasad Reddy: కడప జిల్లా ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Rachamallu Siva Prasad Reddy) సంచలన ఆరోపణలు చేసారు. తన సెల్ ఫోన్ ను గత 20 రోజులుగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ హ్యాక్ చేస్తుందని దీనికోసం రూ. 50 లక్షల డీల్ కూడా జరిగిందని ఆరోపించారు. అంతేకాదు ఈ డీల్ కు సంబంధించిన నాలుగోవంతు చెల్లింపులు కూడా జరిగిపోయాయని ఆరోపిస్తూ…. దీనికి సంబంధించిన ఆధారాలతో ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ కు ఆయన ఫిర్యాదు చేసారు. ఇదే విషయాన్ని ఎస్పీకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… తనను భౌతికంగా తుద ముట్టించాలనో, రాజకీయంగా దెబ్బతీయాలనో తన ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత విషయాలుంటాయని, అందులోకి వేరేవారు తొంగి చూడడం దారుణమని అయన మండిపడ్డారు. అంతేకాదు తాను నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, బలమైన ఆధారాలుండటంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేసారు.

MLA Rachamallu Siva Prasad Reddy Phone Hacking

అయితే ఎమ్మెల్యే రాచమల్లు ఫిర్యాదు ఇప్పుడు అధికార పార్టీకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు కీలక నాయకుల్లో కలకలం రేపుతోంది. ఈ సెల్ ఫోన్ హ్యాకింగ్ అధికార పార్టీ చేయించిందా, లేక ప్రతిపక్ష పార్టీలు చేయిస్తున్నాయా, లేక అతనితో విభేదాలు ఉన్న ప్రత్యర్ధులు చేయించారా అనే చర్చ జరుగుతోంది. గతంలో నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సెల్ ఫోన్ ను సాక్ష్యాత్తూ ప్రభుత్వమే హ్యాక్ చేసిందని సంచలన ఆరోపణలు చేసారు. అతనితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులపై ముఖ్యమంత్రి జగన్ పెట్టిన నిఘాలో భాగంగా ఈ సెల్ ఫోన్ హ్యాకింగ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసారు. అయితే తాజాగా ప్రోద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కూడా తన సెల్ ఫోన్ హ్యాక్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే అతను మాత్రం అధికార పార్టీపై ఇంతవరకు ఎక్కడా అనుమానాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

Also Read : YSRCP Final List : ఇవాళ వైసీపీ తుది జాబితా… ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎలా…?

Leave A Reply

Your Email Id will not be published!