MLC Duvvada Srinivas : పోలీసు విచారణకు మాధురితో కలిసి హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ

అయితే నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్....

Duvvada Srinivas : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలసి పోలీసుల విచారణకు హాజరయ్యారు. జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) శుక్రవారం మధురితో కలిసి విచారణకు వచ్చారు.

Duvvada Srinivas visit

కాగా ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై అనేక కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు షాక్‌ ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు జారీ చేసింది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు.

అయితే నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తాను భయపడేది లేదన్నారు. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కారుకు కూడా నిప్పంటించారని, చంపేస్తామని బెదిరించారని వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తల ఆగడాలపై తాను పోలీస్ స్టేషన్‌లో సాక్షాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు పోలీసులు ఇప్పుడు 41ఏ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

Also Read : TG High Court : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!