Vivek Venkata Swamy : లిక్క‌ర్ కేసులో క‌విత అరెస్ట్ త‌ప్ప‌దు

బీజేపీ నేత వివేక్ వెంక‌టస్వామి

Vivek Venkata Swamy Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఒక్కో వికెట్ ప‌డుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మందిని అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా ఆప్ వ్య‌వ‌స్థాప‌క స‌ఢ్యుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ను అరెస్ట్ చేసింది. కోర్టులో హాజ‌రు ప‌ర్చింది. 5 రోజుల పాటు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరింది. ఈ సంద‌ర్భంగా ఇదే కేసుకు సంబంధించి సీబీఐ మ‌రో ఇద్ద‌రిది కీల‌క పాత్ర ఉందంటూ స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన రెండో నివేదిక‌లో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరును కూడా చేర్చింది. సౌత్ గ్రూప్ పేరుతో కోట్లు కొల్ల‌గొట్టార‌ని తెలిపింది. క‌విత 10 సెల్ ఫోన్లు ధ్వంసం చేసింద‌ని ఆరోపించింది. వీటిని అర‌వింద్ కేజ్రీవాల్ , క‌విత ఖండించారు.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ వ్యాపార సంస్థకు చెందిన వివేక్ వెంక‌ట స్వామి(Vivek Venkata Swamy) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సిసోడియా అరెస్ట్ అయ్యార‌ని, ఇక మిగిలింది ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) మాత్ర‌మే మిగిలింద‌ని ఆమె కూడా అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌విత‌పై చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి భార‌త రాష్ట్ర స‌మితిలో.

మ‌ద్యం కుంభ‌కోణంలో మ‌రికొంత మంది అరెస్ట్ కావ‌డం త‌ప్ప‌ద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Also Read : కోర్టుకు హాజ‌రైన మ‌నీష్ సిసోడియా

Leave A Reply

Your Email Id will not be published!