MLC Kavitha Comment : మద్యం కుంభకోణం కిం కర్తవ్యం
కేసులు సరే దొంగలు ఎవరో
MLC Kavitha Comment : ఢిల్లీ లిక్కర్ స్కాం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఓ వైపు చైనా, భారత్ సరిహద్దు వివాదం కంటే ఇదే హాట్ టాపిక్ గా మారడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఇందులో భాగం పంచుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏపీలో లిక్కర్ డాన్ గా ఇప్పటికే పేరొందారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఆయన తనయుడు రాఘవ రెడ్డి పేరు కూడా తాజాగా బయటకు వచ్చింది.
అధికార వైసీపీకి చెందిన కీలక నాయకుడు, ఎంపీ విజయ సాయి రెడ్డి స్వంత అల్లుడికి సోదరుడైన అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డితో పాటు ఆయన భార్య కనికా రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
ఇదే సమయంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఎప్పుడైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా వచ్చారో ఆనాటి నుంచి ఆప్ కు ఎల్జీకి పడడం లేదు. మద్యం పాలసీకి సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయని దానిపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించారు.
ఈ మేరకు రంగంలోకి దిగింది సీబీఐ. ఆ వెంటనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టింది. ఆయన ఫోన్ , ల్యాప్ టాప్ ను తీసుకు వెళ్లింది. మద్యం స్కాంలో 15 మందిపై అభియోగాలు మోపింది. ఆ తర్వాత మొత్తం దేశ వ్యాప్తంగా 36 మందిని చేర్చింది.
ఇందులో ప్రధానంగా ఈడీ , సీబీఐ సోదాలు చేపట్టింది. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేరు బయట పెట్టింది. విచారణ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేసింది.
ఇండో స్పిరిట్ ఎండీ , విజయ్ నాయర్, అమిత్ అరోరా, బోయనపల్లి అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై , శరత్ చంద్రా రెడ్డి ,ఆడిటర్ బుచ్చిబాబు, శ్రీనివాసరావులను విచారించింది. చివరకు శరత్ చంద్రా రెడ్డి, అమిత్ అరోరా, సమీర్ ను అరెస్ట్ చేసింది. రిమాండ్ కు తరలించింది.
కస్టడీలో వీరందరిని విచారించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. అమిత్ అరోరాకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది. ఆమె కీలకంగా వ్యవహరించారంటూ తెలిపింది. అంతే కాదు 11 ఫోన్లు ధ్వంసం చేసిందని పేర్కొంది.
మొత్తం ఆధారాలు దొరకకుండా 36 ఫోన్లు లేకుండా చేశారంటూ ఆరోపించింది. ఆపై నోటీసు జారీ చేసింది సీబీఐ. ఇదే సమయంలో డిసెంబర్ 11న
విచారణ చేపట్టింది ఎమ్మెల్సీ కవిత ఇంట్లో. తాజాగా ఈడీ సంచలన ప్రకటన చేసింది.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, శరత్ చంద్రా రెడ్డి కలిసి సౌత్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. 65 శాతం వారిదైతే ఒక్క కల్వకుంట్ల కవిత వాటా 32 శాతమని పేర్కొంది. గత కొంత కాలం నుంచి కేంద్రంపై బురద చల్లుతూ వచ్చిన కవిత(MLC Kavitha) కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకమైన పాత్ర పోషించింది లిక్కర్ రాణినేనంటూ స్పష్టం చేసింది. దీంతో ఏం చేయాలనే దానిపై కవిత తండ్రి సీఎం
కేసీఆర్ వద్దకు వెళ్లడం, సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విచిత్రం ఏమిటంటే కవిత(MLC Kavitha) భర్త అనిల్ కూడా పాల్గొన్నారంటూ మరో బాంబు పేల్చింది ఈడీ. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది ఏ
పాత్ర అనేది దర్యాప్తు సంస్థలు నోరు విప్పితే కానీ అసలు దోషులు ఎవరో తేలుతుంది.
Also Read : కరోనా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా – నితీశ్