MLC Kavitha : కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ – క‌విత

ఫ్రంట్ అన్న‌ది లేనే లేదు

MLC Kavitha Congress : భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో థర్డ్ ఫ్రంట్ అన్న‌ది క‌ల త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కాదని సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఆ పార్టీ ఖాళీగా ఉంద‌ని, చాలా మంది ఇత‌ర పార్టీల‌లోకి జంప్ అవుతున్నార‌ని ఎద్దేవా చేశారు క‌విత‌. ఇత‌ర పార్టీల వైపు ఆ పార్టీకి చెందిన నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు , క్యాడ‌ర్ చూస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ తండ్రి సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని అన్నారు. ఎక్క‌డికి వెళ్లినా పార్టీలో చేరుతామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని చెప్పారు.

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి బీఆర్ఎస్ ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయం అని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్సీ క‌విత‌. మహారాష్ట్రలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ ఊహించ‌ని రీతిలో విజ‌యవంతం అయ్యింద‌న్నారు. ఇది ఒక్క‌టి చాలు త‌మ‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ ఏమిటో చెప్ప‌క‌నే చెప్పింద‌న్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం చ‌రిత్ర‌లో ఒక పాఠం మాత్ర‌మేన‌ని అది ముగిసే ద‌శ‌లో ఉంద‌న్నారు ఎమ్మెల్సీ(MLC Kavitha Congress). ప్ర‌జా ఆధారిత అభివృద్దే త‌మ తుది ఎజెండా అని స్ప‌ష్టం చేశారు. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీల‌ను బ‌లంగా ఏర్పాటు చేసేందుకు త‌న తండ్రి కృషి చేస్తున్నారంటూ చెప్పారు. శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ తో త‌మ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయ‌ని అన్నారు.

Also Read : గాడి త‌ప్పిన కేసీఆర్ పాల‌న

Leave A Reply

Your Email Id will not be published!