Modi Amit Shah Focus : తెలంగాణపై మోదీ..షా ఫోకస్
పలు సభలలో పాల్గొనే ఛాన్స్
Modi Amit Shah Focus : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల నగారా మోగించింది. నవంబర్ 3న గెజిట్ రానుంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 13, విరమించు కునేందుకు 15 డెడ్ లైన్ విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. వీటితో పాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ మేరకు ప్రధాన క్యాంపెయినర్లను ఇక్కడికి రానున్నారు.
Modi Amit Shah Focus on Telangana
ఇందు కోసం పార్టీ హైకమాండ్ ఎక్కువగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi), ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో పాటు పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఫోకస్ పెట్టనున్నారు తెలంగాణలో. ఇందుకు గాను ఎక్కువగా సాద్యమైనంత మేరకు సభలు, సమావేశాలలో పాల్గొననున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనీసం 5 నుంచి 10 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక అమిత్ షా 10 నుంచి 15 సమావేశాల్లో పాల్గొంటారు. ఇక జేపీ నడ్డా 10కి పైగా మీటింగ్ లలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఎలాగైనా సరే ఓటు బ్యాంకు చీల్చాలని చూస్తోంది. ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను ఖరారు చేశారు. మొత్తంగా తెలంగాణలో పవర్ లోకి వచ్చేందుకు అన్ని ఆయుధాలు సిద్దం చేస్తోంది.
Also Read : Telangana BJP List : బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
