Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై మరోసారి నిప్పులు చెరిగారు. రేపు జరిగే ఆఖరి విడత పోలింగ్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈసారి జరిగే ఎన్నికల్లో దళితులు, బహుజనులు, మైనార్టీల ఓటు బ్యాంకు కీలకం కానుంది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం కాషాయానిదేనని ధీమా వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి.
గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గతంలో పాలకులు తమ స్వలాభం కోసం మాత్రమే పని చేశారని కానీ తాము వచ్చాక పేదలకు , సామాన్యులకు మేలు చేకూర్చేలా కృషి చేశామని అన్నారు.
వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ప్రజలు పట్టించు కోవడం లేదన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇంకెన్ని వాగ్ధానాలు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితిలో లేరని (Modi)స్పష్టం చేశారు.
డిజిటల్ భారతం ప్రపంచానికి ఆదర్శంగా మారిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఇవాళ ఫార్మా హబ్ గా మారిందన్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో వరల్డ్ లో భారత్ టాప్ లో నిలిచిందన్నారు.
దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). యోగి పాలనలో యూపీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందన్నారు.
Also Read : రెండో విడత పోలింగ్ హింసాత్మకం