Modi Quad Summit : యుద్దం విరమిస్తేనే శాంతి సాధ్యం
ఉక్రెయిన్ పై రష్యా దాడులపై మోదీ
Modi Quad Summit : యుద్దం ఎన్నటికీ ఆమోదమైనది కాదు. శాంతి ఒక్కటే ఈ ప్రపంచాన్ని సంతోషమయం చేస్తుంది. ప్రపంచంలో ముందు నుంచీ శాంతి, సామరస్యతను కోరుకుంటున్నది భారత దేశం ఒక్కటేనని మరోసారి కుండ బద్దలు కొట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Quad Summit).
జపాన్ లోని టోక్యోలో అమెరికా, జపాన్, భారత్ , ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ సమ్మిట్(Modi Quad Summit) లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో యుద్దాన్ని కొనసాగిస్తూ వస్తున్న రష్యాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము ఎవరి పక్షం వహించబోమని స్పష్టం చేశారు. భారత్ ఎవరితో గిల్లి కజ్జాలకు దిగదు. అలాగని తమ జోలికి వస్తే మాత్రం ఉపేక్షించదన్నారు. తాము దాడులు జరపడాన్ని ముందు నుంచీ ఖండిస్తూ వస్తున్నామన్నారు.
ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా తమ విదేశాంగ విధానం ఒక్కటే అందరితో కలిసి ఉండాలని అనుకోవడమన్నారు మోదీ.
అంతే కాదు అనేక ద్వైపాక్షిక, బహుళజాతి ఫోరమ్ లలో భారత దేశం ఉక్రెయిన్ సమస్యను లేవనెత్తిన విషయాన్ని ఉదాహరణలతో వివరించారు ప్రధాన మంత్రి.
దౌత్య మార్గం ఉత్తమమైనది. ఏకపక్ష దాడుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. యుద్దం వల్ల మిగిలేది విషాదం మాత్రమేనని, విజయం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
ఈ సందర్బంగా ఉక్రెయిన్ పై భారత దేశం సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు పంతాలకు పోకుండా సామరస్య పూర్వకమైన ధోరణిని అవలంభించాలని పిలుపునిచ్చారు.
అందుకు క్వాడ్ సభ్య దేశాలు కృషి చేయాలని కోరారు నరేంద్ర మోదీ.
Also Read : క్వాడ్ ప్రపంచానికి ఓ దిక్సూచి – మోదీ