Modi Strategy : వ్యూహం ఫ‌లించింది గెలుపు ద‌క్కింది

మ‌రోసారి స‌త్తా చాటిన మోదీ త్ర‌యం

Modi Strategy : భార‌తీయ జ‌న‌తా పార్టీ ముందు నుంచీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌స్తోంది. స్ప‌ష్ట‌మైన మెజారిటీ రావ‌డంతో పాటు అధికారం చేతుల్లో ఉండ‌డంతో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు క‌దులుతోంది.

యావ‌త్ దేశం మొత్తం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఏక వ్య‌క్తి పాల‌న‌. రాహుల్ గాంధీ ఆరోపించిన‌ట్లు ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం లేదు కేవ‌లం రాచ‌రికం మాత్ర‌మే ఉంద‌న్నారు.

ఓ వైపు ప్ర‌జా స‌మ‌స్య‌లు పేరుకు పోతుంటే ఎన్నిక‌ల‌ను ఓ పండుగ‌లా చేయ‌డంలో, ప్ర‌జ‌ల్లోకి ఘ‌నంగా ప్ర‌చారం చేయ‌డంలో బీజేపీ త‌ర్వాతే ఏ పార్టీ అయినా.

దీని వెనుక మంత్రాంగం ఉంది. ఇవాళ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో మోదీ త్ర‌యం స‌క్సెస్ అయ్యింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(Modi Strategy) విప‌క్షాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఆయ‌న ఎంపిక చేసిన వ్య‌క్తి ఆదివాసీ, గిరిజ‌న తెగ‌కు చెందిన వ్య‌క్తిని ఎంపిక చేయ‌డం. ఇక్క‌డే సగం విజ‌యం సాధించేలా మార్గం సుగ‌మ‌మం చేశారు. సామాన్యంగా న‌రేంద్ర మోదీ బ‌య‌ట ప‌డ‌డు.

త‌న ఆలోచ‌న‌లు త‌న‌లోనే ఉంచుకుంటాడు. ఆయ‌న ఇప్పుడు ఏది చెబితే అదే చ‌ట్టం. శాస‌నం. పార్టీలో ఏకాభిప్రాయం వ‌చ్చేలా చేయ‌డంలో

స‌క్సెస్ అయ్యారు మోదీ.

ఇక మోదీ త్ర‌యంగా పేరొందిన న‌రేంద్ర మోదీ, అమిత్ చంద్ర షా, జేపీ న‌డ్డా ఇప్పుడు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్ 

గ్రౌండ్ లేకుండానే రాష్ట్ర‌ప‌తి స్థాయికి తీసుకు వచ్చేలా చేసిన ఘ‌న‌త‌ను మోదీ కొట్టేశాడు.

విచిత్రం ఏమిటంటే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌లో ఎక్కువ శాతం విప‌క్షాల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచే పోల్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఒక ర‌కంగా ప్ర‌తిప‌క్షాల‌కు కోలుకోలేని షాక్. ఏది ఏమైనా బీజేపీని ప్ర‌ధానంగా మోదీని ఎదుర్కోవాలంటే కాస్తం ఆలోచ‌నే కాదు ద‌మ్ముండాలి.

ఒక ర‌కంగా రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇది బూస్ట్ అప్ గా పేర్కొన‌డంలో తప్పు లేదు. ఎందుకంటే మోదీ త్రయాన్ని త‌ట్టుకునేందుకు

కావాల్సిన బ‌లం విప‌క్షాలు పొందాల్సి ఉంటుంది.

లేక పోతే మ‌రోసారి కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని గుర్తించాలి.

Also Read : ద్రౌప‌ది ముర్ముకు జై కొట్టిన విప‌క్షాలు

Leave A Reply

Your Email Id will not be published!