Nirmala Sitharaman : మోదీ నిర్ణయం ప్రశంసనీయం – నిర్మలా
రష్యా చమురు 2 శాతం నుంచి 12 శాతానికి
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని. న్యూఢిల్లీలో యుఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఇండియా ఐడియాస్ సమ్మిట్ లో ఆమె పాల్గొని ప్రసంగించారు.
రష్యా చమురుపై కీలకమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారి తీసిన సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని మోదీకి కితాబు ఇచ్చారు.
ప్రధానంగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్దం ప్రారంభమైంది. గత ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు తగ్గడం లేదు.
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ , ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ ఎక్కడా తగ్గడం లేదు. ప్రధానంగా ఈ యుద్దం కారణంగా చమురు నిల్వలు, సరఫరా, ఉత్పత్తిపై ఎక్కువగా ప్రభావం పడింది.
దీంతో మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. ధరా భారం మోయలేనిదిగా తయారైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆయిల్ దెబ్బకు లబోదిబోమంటున్నాయి.
గ్లోబల్ మార్కెట్ లో ఊహించని రీతిలో ధరలు పెరిగాయి. వాటిని తగ్గించేందుకు గాను తమ ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నాలు చేసిందన్నారు నిర్మలా సీతారామన్.
ఈ విపత్కర సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుండి ఆయిల్ తీసుకోండి.
ఎందుకంటే వారు తగ్గించి ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారని చెప్పారు.
Also Read : భారత్ జోడో యాత్రకు భారీ స్పందన
