Moeen Ali : ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ గా మోయిన్ అలీ

గాయం కార‌ణంగా మోర్గాన్ దూరం

Moeen Ali  : ఊహించ‌ని రీతిలో ఛాన్స్ ద‌క్కింది క్రికెట‌ర్ మోయిన్ అలీకి. వెస్టిండీస్ టూర్ లో ఉన్న ఇంగ్లండ్ టీంకు భారీ షాక్ త‌గిలింది. తీవ్రంగా గాయం కావ‌డంతో ఆ జ‌ట్టు స్కిప్ప‌ర్ ఇయాన్ మోర్గాన్ టీ20 మ్యాచ్ ల‌కు దూర‌మ‌య్యాడు.

దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడైన ఆల్ రౌండ‌ర్ మోయిన్ అలీకి (Moeen Ali )సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ధ్రువీక‌రించింది.

మోయిన్ అలీ ఇప్ప‌టికే బీసీసీఐ నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఇంగ్లండ్ కు మూల స్తంభంగా ఉంటూ వ‌చ్చాడు.

అంతే కాదు కీల‌కమైన పాత్ర పోషిస్తూ వ‌చ్చిన మోయిన్ అలీ (Moeen Ali )పైనే ఇంగ్లండ్ బోర్డు మొగ్గు చూపింది. ఇదిలా ఉండ‌గా తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో ఇక తాను ఆడ‌లేనంటూ స్ప‌ష్టం చేశాడు మోర్గాన్.

వైద్యులు సైతం కొంత విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో మోయిన్ అలీకి చాన్స్ ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని బోర్డు పేర్కొంది. ఇప్ప‌టికే విండీస్ తో జ‌రిగిన టీ20 మ్యాచ్ కు సార‌థ్యం వ‌హించాడు.

ఇదిలా ఉండ‌గా 5 టీ20 మ్యాచ్ ల సీరీస్ లో ఇప్ప‌టికే వెస్టిండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఓట‌మి పాలైన ఇంగ్లండ్ రెండో వ‌న్డేలో కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు తేడాతో అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసింది.

మ‌రో వైపు ఇప్ప‌టి దాకా నాయ‌క‌త్వం వ‌హించిన మోర్గాన్ రెండు మ్యాచ్ ల్లో రాణించ లేక పోయాడు. ఇదిలా ఉండ‌గా మోర్గాన్ కూడా ఐపీఎల్ లో ఆడుతుండ‌డం విశేషం.

Also Read : ఆకాష్ చోప్రా కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!