Mohammad Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammad Azharuddin) పోలీసులను ఆశ్రయించారు.
హెచ్సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనను బెదిరించేందుకు యత్నిస్తున్నారంటూ హైదరాబాద్ లోని బేగంపేట పోలీసులను ఆశ్రయించాడు.
ఈ మేరకు గతంలో సస్పెండ్ అయిన జాన్ మనోన్, విజయానంద్, నరేశ్ శర్మలపై ఫిర్యాదు చేశారు. వీరంతా జింఖానా గ్రౌండ్ లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీసుకు వచ్చి నానా రభస చేశారని వాపోయారు.
అంతే కాకుండా అక్కడ ఉన్న కొంత మంది సిబ్బందిని బెదిరించారంటూ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అజ్జూ భాయ్ హెచ్ సీ ఏ కు చీఫ్ గా ఎన్నికైన నాటి నుంచి వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే భారత జట్టుకు ఆటగాడిగా, నాయకుడిగా ఎనలేని విజయాలు సాధించి పెట్టిన ఈ అరుదైన క్రికెటర్ ఇలాంటి చిన్న సంస్థ కోసం పాకులాడటమే పెద్ద మిస్టరీగా మారింది.
పనిలో పనిగా అజ్జూ భాయ్(Mohammad Azharuddin) ఆట నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రీడాభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి ఆయన లాగా మణికట్టు మాయాజాలంతో క్రికెట్ ఆడే ఆటగాళ్లు ఇంకా తయారు కాలేదు వరల్డ్ వైడ్ గా.
ఆయన సపోర్ట్ తోనే గంగూలీ క్రికెటర్ గా ఎదిగాడు. ఇదిలా ఉండగా తన సారథ్యంలో ఆడిన ఆటగాళ్లు ఇప్పుడు టాప్ పొజిషన్స్ లో ఉంటే మనోడు మాత్రం రాష్ట్రానికే పరిమితం కావడం బాధాకరం.
కాగా ఈ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు బేగంపేట ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ రావు.
Also Read : రవీంద్ర జడేజా దమ్మున్నోడు