Mohammad Azaharuddin : అజారుద్దీన్ కు చేదు అనుభవం
అడ్డుకున్న విష్ణు వర్దన్ రెడ్డి వర్గం
Mohammad Azaharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ , ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైన పోస్టులో ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ కు చేదు అనుభవం మిగిలింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఆయన మొదటి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం విష్ణు వర్దన్ రెడ్డికి చెందిన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Mohammad Azaharuddin Faced A Group War
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు కూడా చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ లోని కార్మిక నగర్ లో సభ నిర్వహించేందుకు అజారుద్దీన్(Mohammad Azaharuddin) అక్కడికి వచ్చారు.
ఇక్కడ దివంగత పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణు వర్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారని మీరు టికెట్ ఎలా ఆశిస్తారంటూ అజారుద్దీన్ ను ప్రశ్నించారు. ఆపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిని చెల్లా చెదురు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు జూబ్లీ హిల్స్ లో గ్రూప్ వార్ మళ్లీ మొదలైంది.
Also Read : Bhola Shankar Ticket Rates : భోళా శంకర్ మూవీకి సర్కార్ షాక్