Mohammad Azharuddin : అజ్జూ భాయ్ ను ఎలా మరిచి పోగలం
భారత క్రికెట్ రంగంపై చెరగని ముద్ర
Mohammad Azharuddin : ఇవాళ యావత్ భారత దేశం గర్వించే అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది భారత క్రికెట్ రంగం. ఒకప్పుడు తానే డబ్బులు ఇచ్చి దూరదర్శన్ లో క్రికెట్ మ్యాచ్ లను ప్రసారం చేయించుకున్న బీసీసీఐ ఇప్పుడు ఏకంగా రూ. 48,390 వేల కోట్లతో డిజిటల్, ప్రసార హక్కుల్ని ఐదేళ్ల కాలానికి విక్రయించే స్థాయికి చేరింది.
అంతే కాదు వరల్డ్ వైడ్ గా రిచ్ లీగ్ లలో ఈ వేలంతో ఐపీఎల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా పక్కన పెడితే భారత క్రికెట్ రంగాన్ని జనరంజకం చేసిన ఆటగాళ్లు ఇద్దరు ఉన్నారు.
వారిలో ఒకరు అరుదైన క్రికెటర్, లివింగ్ లెజెండ్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్. 1983లో భారత జట్టుకు నాయకత్వం వహించడమే కాదు తానే ముందుండి నడిపించి ఏకంగా వరల్డ్ కప్ ను తీసుకు వచ్చాడు.
ఆనాటి నుంచి నేటి దాకా క్రికెట్ ను దేశ వ్యాప్తంగా మల్చడంలో కపిల్ సాధించిన విజయం కీలక భూమిక పోషించింది. ఇక హైదరాబాద్ కు చెందిన మణికట్టు మాంత్రికుడు మహ్మద్ అజహరుద్దీన్(Mohammad Azharuddin) ను ఎలా మరిచి పోగలం.
కపిల్ దేవ్ తర్వాత గణనీయమైన విజయాలు సాధించి పెట్టిన క్రికెటర్ గా, కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ముంబై ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. అంతే కాదు దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చేలా కీలక పాత్ర పోషించాడు.
వస్తూనే మూడు సెంచరీలతో రికార్డు సృష్టించాడు. ఆపై టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు సాధించి పెట్టాడు.
అతడి ఆధ్వర్యంలోనే సచిన్ మెరిశాడు. ద్రవిడ్ రాణించాడు. గంగూలీ , సిద్దూ, అజయ్ జడేజా..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరినో వెన్నుతట్టి ప్రోత్సహించాడు అజ్జూ భాయ్(Mohammad Azharuddin).
Also Read : ఆనాటి విజయం నేటి క్రికెట్ కు ఊతం