Mohammad Azharuddin : మ‌హిళా జ‌ట్టుపై అజ‌హ‌రుద్దీన్ ఆగ్ర‌హం

చెత్త బ్యాటింగ్గ‌..ఇంగిత జ్ఞానం లేద‌ని ఫైర్

Mohammad Azharuddin :  కామ‌న్వెల్త్ గేమ్స్ -2022లో ఫైన‌ల్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు ఆస్ట్రేలియాతో 9 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలై ర‌జ‌త ప‌త‌కానికే ప‌రిమిత‌మైంది. స్కిప్ప‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఒక్క‌రే 65 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది.

చివ‌రి వ‌ర‌కు మ్యాచ్ ను తీసుకు వ‌చ్చింది. కానీ ఫ‌లితం లేక పోయింది. 162 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేరుకోలేక 152 ప‌రుగుల‌కే చాప చుట్టేయ‌డంపై సీరియ‌స్ గా స్పందించారు మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మహ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్(Mohammad Azharuddin).

ఓ వైపు ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించినందుకు ఓ వైపు ప్ర‌శంస‌లు అందుకుంటుంటే మాజీ కెప్టెన్ మాత్రం మ‌హిళ‌ల ఆట తీరుపై మండిప‌డ్డాడు. భార‌త జ‌ట్టు బాధ్య‌తా రాహిత్యంతో ఆడింది.

ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఫైన‌ల్ లో గెల‌వాల్సిన మ్యాచ్ ను చేజేతులారా ఆస్ట్రేలియాకు అందించారంటూ నిప్పులు చెరిగాడు. ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా అజ‌హ‌రుద్దీన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఇలాంటి కీల‌క మ్యాచ్ ఆడేటప్పుడు ఒత్తిడికి ఎందుకు లోన‌వుతారో తెలియ‌డం లేద‌ని పేర్కొన్నాడు. చివ‌రి దాకా పోరాడాల్సిన వాళ్లు త‌మకేమీ ప‌ట్ట‌న‌ట్లు ఆడారంటూ ఫైర్ అయ్యాడు మాజీ కెప్టెన్.

ఈ ఈవెంట్ లో మిగ‌తా మ్యాచ్ లలో రాణించినా ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చేస‌రిక‌ల్లా ఎందుకు పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ లేక పోయారంటూ ప్ర‌శ్నించాడు అజ‌హ‌రుద్దీన్.

ఇదే స‌మ‌యంలో బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ కూడా ఒకింత నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు. బంగారు ప‌త‌కాన్ని గెల‌వాల్సిన వాళ్లు ఇలా ఆడ‌డం ఏంటి అంటూ పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : మ‌హిళా క్రికెట‌ర్ల ఆట అద్భుతం – దాదా

Leave A Reply

Your Email Id will not be published!