Mohammad Azharuddin : నెట్టింట్లో అజ్జూ భాయ్ హ‌ల్ చ‌ల్

త‌న వాళ్ల‌తో ఉన్న ఫోటో షేర్

Mohammad Azharuddin : మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. మ‌ణిక‌ట్టు మాంత్రికుడిగా , భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని గుర్తింపు, అద్భుత‌మైన విజ‌యాలు అందించిన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. అనుకోని ప‌రిస్థితుల్లో క్రికెట్ నుంచి నిష్క్ర‌మించాడు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎంపీగా గెలుపొందాడు. బీజేపీ హ‌వాలో ఓట‌మి పాల‌య్యాడు.

Mohammad Azharuddin Waiting for Confirmation

ప్ర‌స్తుతం తెలంగాణ‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్(Mohammad Azharuddin). హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ ఇక్క‌డ తాను త‌ప్ప ఇంకెవ‌రూ నిల‌బ‌డ కూడ‌ద‌ని మాజీ మంత్రి, దివంగ‌త పి జ‌నార్ద‌న్ రెడ్డి కొడుకు పి. విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అయినా అజ‌హ‌రుద్దీన్ డోంట్ కేర్ అన్నాడు. దూకుడు పెంచాడు. ప్ర‌చారాన్ని ప్రారంభించాడు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని, ఈసారి ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ నుంచే పోటీ చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ తాజాగా అరుదైన ఫోటోను షేర్ చేశాడు. ఇందులో త‌న అమ్మ‌మ్మ‌, నాయిన‌మ్మ‌ల‌తో కూడిన పిక్చ‌ర్ ను షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్ గా మారింది. ఎంతైనా అజ్జూ భాయ్ మామూలోడు కాద‌ని తేలి పోయింది.

Also Read : YS Sharmila Tribute : చిర‌స్మ‌ర‌ణీయుడు రాజీవ్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!