Mohammad Azharuddin : రోజర్ బిన్నీకి అజారుద్దీన్ కితాబు
సహృదయం కలిగిన క్రికెటర్
Mohammad Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ముంబైలో జరిగిన సర్వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐ బాస్ గా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఉన్న 1983 వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో కీలక పాత్ర పోషించిన రోజర్ బిన్నీ ఎన్నికయ్యాడు.
ఈ సందర్భంగా తన సారథ్యంలో ఆడిన సౌరవ్ గంగూలీ బీసీసీఐ నుంచి నిష్క్రమించడం..తనతో పాటు ఆడిన బిన్నీ ఇప్పుడు బీసీసీఐ చీఫ్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు అజారుద్దీన్(Mohammad Azharuddin). అజ్జూ సారథ్యంలో భారత జట్టు ఎనలేని విజయాలు సాధించింది. అంతే కాదు ముంబై ఆధిపత్యాన్ని పూర్తిగా తుడిచి వేశాడు.
తనదైన ముద్ర కనబర్చాడు. ప్రధాన ఆటగాళ్లను ప్రోత్సహించాడు. అలాంటి వారిలో గంగూలీ కూడా ఒకడు. తనతో కలిసి ఆడిన జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని అజారుద్దీన్ పేర్కొన్నాడు. రోజర్ బిన్నీ(Roger Binny) క్రికెటర్ గా కంటే సహృదయత కలిగిన వ్యక్తి అని ప్రశంసలతో ముంచెత్తాడు.
గంగూలీది దూకుడు స్వభావం కాగా అజారుద్దీన్ ది ఇంట్రావర్ట్ . ఇక బిన్నీది పూర్తిగా అందుకు డిఫరెంట్ . ఆయన చాలా కూల్. బిన్నీ నేను కలిసి ఆడిన రోజులు మరిచి పోలేమన్నాడు అజారుద్దీన్.
అయితే ఐసీసీ చైర్మన్ రేసులో ఎవరు ఉండాలనే దానిపై చర్చ జరగలేదన్నాడు. బోర్డు తర్వాత నిర్ణయిస్తుందని తెలిపాడు. ప్రస్తుతం అజారుద్దీన్ చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి.
Also Read : టీమిండియా సెమీస్ కు చేరడం కష్టం