Mohammad Hafeez : పాకిస్తాన్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మరోసారి భారత్ తలపడనుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టోర్నీ షెడ్యూల్ డిక్లేర్ చేసింది.
ఈ సందర్భంగా హఫీజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఆటగాళ్లకు తామంటే భయమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే తమను తట్టుకోగలరని మిగతా వాళ్లకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశాడు.
ఈసారి కూడా యూఏఈలో భారత్ ను ఎలా ఓడించామో ఆసిస్ లో కూడా చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు హఫీజ్(Mohammad Hafeez ). ప్రత్యేకించి ఇతర జట్లతో పోటీ కంటే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడినప్పుడే తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పేర్కొన్నాడు.
తమ కంటే ఎక్కువగా టీమిండియా టెన్షన్ కు గురవుతుందని అది తమకు ఎంతగానో లాభం చేకూరుస్తుందన్నాడు. ఇప్పటికే యూఏఈలో భారత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చామని , 10 వికెట్ల తేడాతో ఓడించామని పేర్కొన్నాడు.
సేమ్ సీన్ ఆసిస్ లో కూడా రిపీట్ చేస్తామని స్పష్టం చేశాడు. తమను ఎదుర్కోవాలంటే భారత్ చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు హఫీజ్.
వాళ్లిద్దరే తమ బౌలింగ్ ను ఎదుర్కోగలరని మిగతా వాళ్లు ఆడేందుకు భయానికి లోనవుతారని స్పష్టం చేశాడు పాక్ క్రికెటర్. తాము పెట్టే ఒత్తిడిని తట్టుకోగలిగే సామర్థ్యం వాళ్లకు లేదన్నాడు. ఇటీవలే క్రికెట్ నుంచి రిటర్మైంట్ ప్రకటించాడు హఫీజ్.
Also Read : ఐసీసీ అవార్డుల జాబితా విడుదల