Mohammed Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azharuddin) కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన ఆట తీరుపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆయన ట్విట్టర్ వేదికగా మహిళా జట్టుపై నిప్పులు చెరిగాడు. అత్యంత చెత్త బ్యాటింగ్ తో చేజేతులారా ప్రత్యర్థి జట్టుకు విజయాన్ని బంగారు పల్లెంలో అందించారంటూ మండిపడ్డారు.
చివరి దాకా పోరాడాల్సిన వాళ్ళు ఎందుకని ఆడలేక పోయారంటూ ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మీరు నిరాశతో ఇంటికి వెళ్లడం ఖాయమని పేర్కొన్నాడు.
ప్రస్తుతం అజహరుద్దీన్, గంగూలీలను నెటిజన్లు, మాజీ ఆటగాళ్లు టార్గెట్ చేశారు. కానీ అజహరుద్దీన్ చేసిన కామెంట్ చూస్తే అనుభవం కలిగిన వారున్నా ఎందుకని చెత్తగా ఆడారంటూ ప్రశ్నించాడు.
కాస్తంత ఓపికతో ఉండి ఉంటే భారత జట్టు సులభంగా గెలిచి ఉండేదని, దీంతో మరింత బలం చేకూరేదని అభిప్రాయపడ్డాడు. జట్టు మీద ద్వేషం వ్యక్తం చేయలేదు.
సెలెక్షన్ కమిటీని తప్పు పట్టలేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 65 పరుగులతో రాణించినా ఆఖరులో కీలక సమయంలో ఎందుకని చెత్త షాట్ ఆడేందుకు ప్రయత్నం చేసిందంటూ ప్రశ్నించాడు మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azharuddin).
కామన్ సెన్స్ లేకుండా ఆడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అత్యంత చెత్త బ్యాటింగ్ అంటూ మండిపడ్డాడు. నెటిజన్లు మాత్రం అజ్జూ భాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశంసించాల్సింది పోయి తిడతారా అంటూ మండిపడ్డారు.
Also Read : గంగూలీ ట్వీట్ కలకలం సర్వత్రా ఆగ్రహం