Shami Purple Cap Winner : ప‌ర్పుల్ క్యాప్ విన్న‌ర్ గా ష‌మీ

17 ఇన్నింగ్స్ 28 వికెట్లు

Shami Purple Cap Winner : మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ(Shami) అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాడు. ఈసారి ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అత్యుత్త‌మంగా రాణించాడు. క‌ళ్లు చెదిరే బంతుల్ని విసిరాడు. ప్ర‌త్య‌ర్థుల వికెట్ల‌ను కూల్చాడు. అంత‌కంటే ఎక్కువ‌గా త‌న మిస్సైల్స్ లాంటి బాల్స్ తో బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టాడు. ఒక ర‌కంగా చెప్ప‌లంటే టాప్ ప్లేయ‌ర్లు సైతం ఒకానొక ద‌శ‌లో ఆడేందుకు నానా తంటాలు పడ్డారు.

గ‌త సీజ‌న్ లో కంటే ఈసారి సీజ‌న్ లో ష‌మీ రాణించినా ఆశించిన స్థాయిలో వికెట్లు రాలేదు. కానీ ఈసారి సీజ‌న్ లో పంట పండింది. ఏకంగా 17 మ్యాచ్ ల‌కు గాను 28 వికెట్లు తీశాడు. వ్య‌క్తిగ‌త అత్యుత్త‌మ బౌల‌ర్ల జాబితాలో టాప్ లో నిలిచాడు ష‌మీ. దీంతో ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ ఏకంగా ష‌మీని టాప్ బౌల‌ర్ గా ఎంపిక చేసింది.

విచిత్రం ఏమిటంటే ఈసారి అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌లో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు చెందిన ఆట‌గాళ్లే టాప్ లో నిల‌వ‌డం. బ్యాట‌ర్ల‌లో శుభ్ మ‌న్ గిల్ 890 ర‌న్స్ తో దుమ్ము రేపితే 28 వికెట్లు తీసి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. మొత్తంగా టైటిల్ గెలవ‌క పోయినా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు ప్లేయ‌ర్లు. ఇదిలా ఉండ‌గా ప‌ర్పుల్ క్యాప్ కైవ‌సం చేసుకున్నందుకు గాను ష‌మీకి ఐపీఎల్ నుంచి రూ. 10 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంది.

Also Read : Shubman Gill Orange Cap

Leave A Reply

Your Email Id will not be published!