Mohammed Shami : చుక్కలు చూపించిన షమీ
తడబడిన ఢిల్లీ బ్యాటర్లు
Mohammed Shami : గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) నిప్పులు చెరిగాడు. కళ్లు చెదిరే బుల్లెట్ల లాంటి బంతులతో ఢిల్లీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన షమీ 4 వికెట్లు తీశాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 రన్స్ కే పరిమితమైంది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైనా మహ్మద్ షమీ మాత్రం అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
తాజాగా తీసుకున్న నాలుగు వికెట్లతో టాప్ ప్లేస్ లోకి చేరాడు. పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ 16వ సీజన్ లో 9 మ్యాచ్ లలో ఆడాడు షమీ. మొత్తం 17 వికెట్లు తీశాడు. స్ట్రైక్ రేట్ 7.05గా ఉంది.
ఇన్నింగ్స్ లో తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత 5 బంతుల్లో 5 రన్స్ ఇచ్చాడు. తన రెండో ఓవర్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండో వికెట్ తీశాడు. ఇక మూడో ఓవర్ లో ఒక రన్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఇక 4వ ఓవర్ లో షమీకి వికెట్ దక్కలేదు. నాలుగు పరుగులు మాత్రమే ఇచ్ఆచడు. తన కోటాను 4 ఓవర్లు వేసి 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
Also Read : ఢిల్లీ భళా గుజరాత్ బోల్తా