Mohammed Shami : మేం ఆడాం వాళ్ల వ‌ల్ల‌నే ఓడాం

బ్యాట‌ర్ ల పై ష‌మీ కామెంట్స్

Mohammed Shami : భార‌త స్టార్ క్రికెట‌ర్, పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బౌలింగ్ ప‌రంగా తాము అత్యుత్త‌మమైన ప్ర‌ద‌ర్శ‌న చేశామ‌ని కానీ మా జ‌ట్టులోని బ్యాట‌ర్ లు స‌రిగా ఆడ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఓడి పోవాల్సి వ‌చ్చిందని వాపోయాడు.

విచిత్రం ఏమిటంటే ఇప్ప‌టికే భార‌త స‌ఫారీ టూర్ లో మూడు వ‌న్డేల‌లో వైట్ వాష్ కాగా 1-2 తేడాతో టెస్టు సీరీస్ కూడా సౌతాఫ్రికాకు అప్ప‌గించేసి ఒట్టి చేతుల‌తో భార‌త్ కు వ‌చ్చేసింది టీమిండియాMohammed Shami).

ఈ త‌రుణంలో తాజా, మాజీ ఆట‌గాళ్లు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్, తాత్కాలికంగా కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి స‌ర‌స‌న మ‌నోడు కూడా చేరి పోయాడు.

ఇదిలా ఉండ‌గా యూఏఈలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ లో అత్యంత పేల‌వ‌మైన చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో విప‌రీతంగా ట్రోలింగ్ కు గుర‌య్యాడు ష‌మీ(Mohammed Shami). ఒకానొక స‌మ‌యంలో అత‌డి దేశ భ‌క్తిని కూడా శంకిస్తూ క్రీడాభిమానులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగారు.

దాయాది పాకిస్తాన్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ష‌మీ స్థాయిని మ‌రిచి ఇత‌ర ఆట‌గాళ్ల‌పై రాళ్లు వేసే ముందు తాను ఏ పాటి ప్ర‌ద‌ర్శ‌న చేశాడ‌న్న‌ది ఆలోచించు కోవాల‌ని మ‌రికొంద‌రు సూచిస్తున్నారు.

దేశం కోసం ప్రాతినిధ్యం వ‌హించే జ‌ట్టులో ఆడుతున్న‌ప్పుడు ప్ర‌తి ఆట‌గాడు అద్భుతంగా వంద శాతం ప‌ర్ ఫార్మెన్స్ చేయాల‌ని భావిస్తాడు.

కావాల‌ని ఎవ‌రూ ప‌రుగులు చేయ‌కూడ‌ద‌ని, వికెట్లు ప‌డ‌గొట్ట కూడ‌ద‌ని అనుకోరు. ఇక‌నైనా త‌న నోటిని అదుపులో పెట్టుకుంటే ష‌ఫీకి, ఇత‌ర ఆట‌గాళ్ల‌కు మంచిది.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో ష‌ఫాలీ వ‌ర్మ టాప్

Leave A Reply

Your Email Id will not be published!