Mohd Siraj Released : చేతికి గాయం సిరాజ్ వ‌న్డేల‌కు దూరం

వెల్ల‌డించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

Mohd Siraj Released : రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త క్రికెట్ జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. స్పీడ్ స్ట‌ర్ గా పేరు పొందిన హైద‌రాబాద్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు గాయ‌మైంది. దీంతో వెస్టిండీస్ తో జ‌రిగే మూడు వ‌న్డేల సీరీస్ నుంచి త‌ప్పించారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వెల్ల‌డించింది.

Mohd Siraj Released From

టీమిండియా విండీస్ టూర్ అనంత‌రం ఆస్ట్రేలియాలో , ఆసియా గేమ్స్ ల‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ త‌ర్వాత ఐసీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడుతుంది. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ప్ర‌క‌టించారు. స్టాండ్ బై గా ఇక సిరాజ్ స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేస్తార‌ని ఇంకా వెల్ల‌డించ లేదు బీసీసీఐ.

ఇదిలా ఉండ‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ర‌పున ఐపీఎల్ లో ఆడాడు సిరాజ్ . ఆ త‌ర్వాత విండీస్ టెస్టు మ్యాచ్ లో స‌త్తా చాటాడు. కానీ ఉన్న‌ట్టుండి చేతికి గాయం కావ‌డం, ఆడేందుకు వీలు లేక పోవ‌డంతో సిరాజ్ కు కొన్ని వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు డాక్ట‌ర్లు. దీంతో వైద్యుల సూచ‌న‌ల మేర‌కు బీసీసీఐకి భార‌త జ‌ట్టు టీమ్ మేనేజ్ మెంట్ తెలియ చేసింది. ఈ మేర‌కు ప‌రిశీలించిన బీసీసీఐ వ‌న్డేల నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొంది. మొత్తంగా సిరాజ్ లేక పోవ‌డం అన్న‌ది జ‌ట్టుకు ఒకింత దెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.

Also Read : Mohd Siraj Released : చేతికి గాయం సిరాజ్ వ‌న్డేల‌కు దూరం

 

Leave A Reply

Your Email Id will not be published!