Mohit Sharma : మోహిత్ శ‌ర్మ మ్యాజిక్ ముంబైకి షాక్

14 బంతులు 10 ప‌రుగులు 5 వికెట్లు

Mohit Sharma : గుజ‌రాత్ బౌల‌ర్ మోహిత్ శ‌ర్మ మ్యాజిక్ చేశాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో భ‌య పెట్టాడు. కేవ‌లం 2.2 ఓవ‌ర్లు వేసి 10 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ముంబై ప‌త‌నాన్ని శాసించాడు. ముంబై బ్యాట‌ర్లు బంతుల్ని ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 20 ఓవ‌ర్ల‌లో 233 ర‌న్స్ చేశాడు. గిల్ 129 ర‌న్స్ తో రెచ్చి పోతే సాయి సుద‌ర్శ‌న్ 43 ర‌న్స్ తో దంచి కొట్టారు.

అనంతరం 234 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ చేతులెత్తేసింది. 18.2 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో గుజ‌రాత్ చేసిన భారీ స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టి సారి. మ‌హ్మ‌ద్ ష‌ఫీ మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తిల‌క్ వ‌ర్మ చేతిలో చావు దెబ్బ తిన్నాడు ష‌మీ. ఎలాంటి భ‌యం లేకుండా , జంకు లేకుండా కొట్టాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

ఇదే స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన మోహిత్ శ‌ర్మ(Mohit Sharma) త‌న అసాధార‌ణ‌మైన బౌలింగ్ తో భ‌య‌పెట్టాడు ముంబై బ్యాట‌ర్ల‌ను. ఒకానొక స‌మ‌యంలో డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. సూర్య కుమార్ యాద‌వ్ మ‌రోసారి మెరిశాడు. మొత్తంగా మ‌రోసారి ఛాంపియ‌న్ అనిపించుకుంది గుజ‌రాత్ టైటాన్స్.

Also Read : Sai Sudarshan

 

Leave A Reply

Your Email Id will not be published!