Ramiz Raja : నైతికంగా మాదే విజ‌యం – ర‌మీజ్ ర‌జా

ఆఖ‌రి బంతి నోబాల్ పై షాకింగ్ కామెంట్స్

Ramiz Raja : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అనూహ్యంగా భార‌త జ‌ట్టు చేతిలో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. ఒక ర‌కంగా చివ‌రి అంచుల దాకా వ‌చ్చి నిలిచింది. అద్భుత‌మైన పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది పాకిస్తాన్. ఇదే స‌మ‌యంలో ఆఖ‌రి ఓవ‌ర్ లో అంపైర్ ఇచ్చిన నో బాల్ పై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja). మా జ‌ట్టు అద్భుతంగా ఆడింది. ఒక ర‌కంగా చెప్పాలంటే మేం ఓడి పోలేదు. నైతికంగా మేం గెలిచామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ర‌మీజ్ ర‌జా. ప్రస్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు అనూహ్యంగా మొద‌ట్లోనే నాలుగు వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆ స‌మ‌యంలో విరాట్ కోహ్లీతో పాటు పాండ్యా క‌లిసి జ‌ట్టును గట్టెక్కించారు. విజ‌య తీరాల‌కు చేర్చారు. చివ‌రలో ఆఖ‌రి బంతికి అశ్విన్ ఒక ప‌రుగు తీయ‌డంతో అద్భుత గెలుపు సాధించింది.

దీనిపై ర‌మీజ్ ర‌జా త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు భార‌త జ‌ట్టుపై. తమ జ‌ట్టు ఆట‌గాళ్లు అద్భుతంగా ఆడార‌ని వారిని త‌ప్పు ప‌ట్టేందుకు వీలు లేద‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా జ‌ట్టులో కోహ్లీతో పాటు పాండ్యా క‌లిసి సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మొత్తంగా ర‌మీజ్ ర‌జా ఎందుకు ఇలా మాట్లాడారంటూ భార‌త అభిమానులు నిల‌దీస్తున్నారు.

Also Read : కోహ్లీ ఆట తీరు అద్భుతం – బాబ‌ర్ ఆజం

Leave A Reply

Your Email Id will not be published!