Morbi Bridge Comment : వంతెన ప్ర‌మాదం పాల‌కుల‌దే పాపం

బాధ్య‌తా రాహిత్యానికి ప‌రాకాష్ట‌

Morbi Bridge Comment : ఇది ఊహించ‌ని ప‌రిణామం. అంతులేని విషాదం. ఎవ‌రూ తీర్చ‌లేని అగాధం. అదే గుజ‌రాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘ‌ట‌న‌. అనుకోని దుర్ఘ‌ట‌న‌తో యావ‌త్ భార‌త దేశాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 141 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వంతెన నిర్మించి 150 ఏళ్ల‌కు పైగా అయ్యింది. మ‌ర‌మ్మ‌తుల కోసం గ‌తంలో మూసి ఉంచారు. కానీ ప్ర‌తి ఏటా అక్టోబ‌ర్ నెల‌లో ఛ‌త్ పూజ‌ను చేయ‌డం

ఆన‌వాయితీ. ఇందుకోస‌మే ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీంతో మూకుమ్మ‌డిగా 500 మందికి పైగా మోర్బీ బ్రిడ్జిపైనే ఉన్నారు. దీంతో బ‌రువు ఎక్కువ కావ‌డంతో ఒక్క‌సారిగా కూలి పోయింది.

క‌ళ్ల ముందే వంద‌లాది మంది న‌దిలో ప‌డి పోయారు. అక్క‌డిక్కడే ప్రాణాలు గాల్లో క‌లిసి పోయాయి. ఈ ఏడాదిలో భారీ ప్ర‌మాదం ఇది. ప్ర‌మాదం

దైవాదీనం అంటూ ప్ర‌స్తుతం కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ చిలుక ప‌లుకులు ప‌లుకుతోంది. అనుమ‌తి ఇచ్చే ముందు

వంతెన ప‌రిస్థితి గురించి ఎందుకు తెలుసు కోలేక పోయింది స‌ర్కార్.

ఇది అంతు చిక్క‌ని ప్ర‌శ్న. విచిత్రం ఏమిటంటే ఈ ఘ‌ట‌న‌లో ఎంపీకి సంబంధించిన కుటుంబీకులు కూడా గ‌ల్లంత‌య్యారు. ఇది ప్ర‌కృతి మీద‌నో లేక విప‌త్తు మీద‌నో .క‌నిపించ‌ని దైవంద మీద‌నో నెట్టి వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌డం బాధాక‌రం. ఇది పూర్తిగా మాన‌వ త‌ప్పిద‌మే. పాల‌కుల వైఫ‌ల్యం..పాప‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ని పోయాక సాయం ప్ర‌క‌టించామ‌ని చేతులు దులుపుకుంటే ఎలా. దీనికి బాధ్యులైన వారిని క‌ఠినంగా

శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక వంతెన మ‌ర‌మ్మ‌తుల కోసం కాంట్రాక్టు ద‌క్కించుకున్న కంపెనీ ఇదంతా దైవానుగ్ర‌హం లేక పోవడం వల్లే జ‌రిగింద‌ని చెప్ప‌డం మ‌రింత విడ్డూరంగా

ఉంది. దీని వెనుక పెద్ద క‌థే ఉంది. ప్ర‌భుత్వం నుంచి సరైన ఫిట్ నెస్ స‌ర్టిఫికెట్ తీసుకోకుండానే మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టిన ప్రైవేట్ కంపెనీకి ఎలా అనుమ‌తి ఇచ్చారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏదైనా ప్ర‌మాదానికి జ‌వాబుదారీత‌నం అవ‌స‌రం. ఇలాంటి పెద్ద ప్ర‌మాదం చోటు చేసుకున్న స‌మ‌యంలో ఎవ‌రు బాధ్యులో చెప్ప‌క పోతే ఎలా. విచిత్రం ఏమిటంటే మోర్బీ బ్రిడ్జి పున‌రుద్ద‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ కోసం వాచ్ మేక‌ర్ కంపెనీ అయిన ఒరేవా కంపెనీకి అప్ప‌గించారు. ఇది 15 సంవ‌త్స‌రాల కోసం ఒప్పందం చేసుకున్నారు.

ప్రాథ‌మిక నివేదిక‌ల ప్ర‌కారం చూస్తే వారి వైపు అనుండి అనేక లోపాలు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్నాయి. దీనికి ఉప కాంట్రాక్టు ఇచ్చార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మున్సిపాలిటీ, ఒరెవా మ‌ధ్య అగ్రిమెంట్ మార్చిలో సంత‌కం చేయ‌బ‌డింది. సద‌రు సంస్థ ఎనిమిది నుండి 12 నెల‌ల వ‌ర‌కు వంతెన‌ను తెర‌వ‌లేదు.

ఏడు నెల‌ల పునరుద్ద‌ర‌ణ ప‌నులు పూర్త‌య్యాక వాటిని అక్టోబ‌ర్ 26న ప్రారంభించారు. పోలీస్ ఎఫ్ఐఆర్ ప్ర‌కారం ఇది తీవ్ర‌మైన బాధ్య‌తా రాహిత్యం,

అజాగ్ర‌త్త కార‌ణంగా జ‌రిగింద‌ని తెలుస్తుంది. మ‌ర‌మ్మ‌తుకు సంబంధించి బాధ్యులైన వ్య‌క్తులు స‌రిగా ప‌ని చేయ‌క పోవ‌డం వ‌ల్లే ఇటువంటి విషాద ఘ‌ట‌న‌కు దారి తీసింద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

మోర్బీ వంతెన ఆనాటి బ్రిటీష్ కాలంలో నిర్మించారు. గుజ‌రాత్ భూకంపంలో భారీగా దెబ్బ‌తింది. వంతెన‌పై ఎక్కువ ర‌ద్దీ ఉండ‌డం వ‌ల్లే కూలి

పోయింద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ వంతెన మీద నుంచి వెళ్లాలంటే రుసుము చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఘ‌ట‌న 

నుంచి కేంద్ర‌, రాష్ట్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాలు త‌ప్పించు కోలేవు.

గ‌త పాల‌కుల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేసే ప్ర‌ధాన మంత్రి దీనికి పూర్తి బాధ్య‌త వహించాల్సి ఉంటుంది. ఇక‌నైనా దేశంలోని అన్ని బ్రిడ్జీల‌ను మ‌రోసారి త‌నిఖీ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేక పోతే ఇలాంటి ప్ర‌మాదాల‌లు మ‌రిన్ని చోటు చేసుకునే ప్ర‌మాదం పొంచి ఉంది. మొత్తంగా తాము 

రాజ‌కీయం చేయ‌ద‌ల్చు కోలేద‌ని ప్రాణాలు ముఖ్య‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు పేర్కొన‌డం విశేషం.

ఏది ఏమైనా మోర్బీ వంతెన గుజ‌రాత్ భూకంపాన్ని మ‌రోసారి గుర్తుకు తెచ్చింది. విధి పైనో..దైవం పైనో నెట్టివేస్తే నేరం అవుతుంది..ఇది

ముమ్మాటికీ పాల‌కుల వైఫ‌ల్యం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : పెట్టుబ‌డిదారుల‌కు సాద‌ర స్వాగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!