Morocco VS Spain : స్పెయిన్ ప‌రేషాన్ మొరాకో సెన్సేష‌న్

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు

Morocco VS Spain : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ అనామ‌క జ‌ట్లు అద్భుతాలు చేస్తున్నాయి. తాజాగా మెగా టోర్నీలో టైటిల్ ఫెవ‌రేట్ జాబితాలో ముందంజ‌లో ఉన్న స్పెయిన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మొరాకో. గ్రూప్ లో క్రొయేషియాను కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది మొరాకో(Morocco VS Spain).

ఆపై బ‌ల‌మైన బెల్జియంకు చుక్క‌లు చూపించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఇక మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన లీగ్ మ్యాచ్ లో ఏకంగా స్పెయిన్ ను 3-0 తేడాతో ఓడించి విస్తు పోయేలా చేసింది. మాజీ ఛాంపియ‌న్ కు దిమ్మ తిరిగేలా షాక్ కు గురి చేసింది. ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది.

పెనాల్టీ షూటౌట్ లో మూడు గోల్స్ సాధించింది. మొరాకో త‌ర‌పున అబ్డెల్లామిడ్ స‌బిరి , హ‌కీమ్ జ‌యెచ్ , అక్రాఫ్ హకిమి పెనాల్టి షూటౌట్ లో గోల్స్ సాధించారు. ఇదిలా ఉండ‌గా చివ‌రి వ‌ర‌కు స్పెయిన్ గోల్స్ చేసేందుకు నానా తంటాలు ప‌డింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు స్పెయిన్(Morocco VS Spain) ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. బాల్ ను పూర్తిగా త‌మ స్వాధీనంలో పెట్టుకుంది.

కానీ మ్యాచ్ పూర్త‌య్యేంత వ‌ర‌కు ఇరు జ‌ట్లు ఒక్క గోల్ చేయ‌లేదు. దీంతో అంపైర్లు షూటౌట్ కు చాన్స్ ఇచ్చారు. స్పెయిన్ ఒక్క గోల్ సాధించ‌క పోగా మొరాకో ఏకంగా 3 గోల్స్ తో దుమ్ము రేపింది. మాజీ ఛాంపియ‌న్ కు దిమ్మ తిరిగేలా విస్తు పోయేలా చేసింది.

Also Read : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!