Moscow Goa Flight Diverted : గోవా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు

ఉజ్బెకిస్తాన్ ఎయిర్ పోర్ట్ కు త‌ర‌లింపు

Moscow Goa Flight Diverted : మాస్కో నుంచి గోవా వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు రావ‌డంతో ఉజ్బెకిస్తాన్ లోని ఎయిర్ పోర్ట్ కు మ‌ళ్లించారు. ఇదిలా ఉండ‌గా గోవా వెళ్లే ఫ్లైట్ కు ఇలాంటి ముప్పు రావ‌డం వారాల వ్య‌వ‌ధిలో ఇది రెండోసారి.

గోవా ఎయిర్ పోర్ట్ (డ‌బోలిమ్ ) డైరెక్ట‌ర్ కు ఇమెయిల్ ద్వారా బెదిరింపు పంపిన‌ప్పుడు అది ఇంకా భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించ లేదు. అజూర్ ఎయిర్ విమానం -247 మంది ప్ర‌యాణికుల‌తో ఉజ్బెకిస్తాన్ లోని ఎయిర్ పోర్ట్ కు మ‌ళ్లించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

వారం రోజుల వ్య‌వ‌ధిలో ఇంత భ‌యంతో దారి మ‌ళ్లించిన రెండో విమానం ఇది. ఈ నెల ప్రారంభంలో , బాంబు భ‌యంతో అదే విమాన‌యాన సంస్థ‌కు చెందిన మ‌రో చార్ట‌ర్ ఫ్లైట్ గుజ‌రాత్ లోని జామ్ న‌గ‌ర్ కు మ‌ళ్లించారు.

అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేసిన విమానంలో 236 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. మాస్కో నుండి గోవాకు వెళుతున్న అజూర్ ఎయిర్ ఫ్లైట్ లో బాంబు భ‌యం గురించి భార‌త అధికారులు ఎంబ‌సీని అప్ర‌మ‌త్తం చేశారు(Moscow Goa Flight Diverted).

జామ్ న‌గ‌ర్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న వారంతా సుర‌క్షితంగా ఉన్నారు. అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారని ర‌ష్యా రాయబార కార్యాల‌యం ప్ర‌క‌ట‌న చేసింది. కాల్ బూట‌క‌మ‌ని క‌నిపించిన మ‌రోస‌టి రోజు విమానం టేకాఫ్ గాకు అనుమ‌తి ల‌భించింది.

ఈ సంఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే విమానంలో బాంబు ఉన్న‌ట్లు కంట్రోల్ రూమ్ కు కాల్ రావ‌డంతో ఢిల్లీ నుండి పూణే స్పైస్ జెట్ విమానం దేశ రాజ‌ధానిలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్టులో టేకాఫ్ కావ‌డానికి ముందు ఆల‌స్య‌మైంది.

బాంబు బెదిరింపు రావ‌డంతో ఎయిర్ పోర్ట్ ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ బాంబు బెదిరింపు అసెస్ మెంట్ క‌మిటీని ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఆప‌రేష‌న్స్ కంట్రోల్ సెంట‌ర్ కి స‌మాచారం అందించింద‌ని సీఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు.

Also Read : ప‌రేడ్ లో క‌వాతుకు ‘దిశా’ నాయ‌క‌త్వం

Leave A Reply

Your Email Id will not be published!