Talha Saeed : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పేరొందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్(Talha Saeed) ను ఉగ్రవాదిగా ప్రకటించింది.
26/11 సూత్రధారిగా పేరొందారు . 32వ టెర్రరిస్టుగా పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం , 1967 ప్రకారం ఉగ్రవాదిగా వెల్లడించింది. ఇదిలా ఉండగా హఫీజ్ తల్హా టెర్రర్ గ్రూపు మతాధికారుల విభాగానికి చీఫ్ గా ఉన్నారు.
హఫీజ్ తల్హా భారత దేశంలో, ఆఫ్గనిస్తాన్ లో ఎల్ఇటీచే రిక్రూట్ మెంట్ , నిధుల సేకరణ, ప్లాన్, దాడులు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
హఫీజ్ తల్హా తండ్రి, ముంబై ఉగ్రదాడి సూత్ర ధారి హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక శాఖ దాఖలు చేసిన రెండు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులలో దోషిగా తేల్చింది.
దీంతో 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు కేంద్రం ఉగ్రవాదులపై ఫోకస్ పెట్టింది. దేశంలోని ఎల్ఇటి , దాని సహచరులపై భారత దేశం ముందస్తుగా హెచ్చరిస్తోంది.
హఫీజ్ తల్హా పాకిస్తాన్ లోని ఎల్ ఇటీ క్యాంపులను సందర్శిస్తున్నాడని , తన ప్రసంగాల సమయంలో ఇతర పాశ్చాత్య దేశాలలో విద్రోహ చర్యలకు ఊతం ఇస్తున్నాడని గుర్తించింది.
భారత దేశం, ఇజ్రాయెల్ , యుఎస ప్రయోజనాలకు వ్యతిరేకంగా జిహాద్ ను ప్రచారం చేస్తున్నాడని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులను గుర్తించే పనిలో పడింది కేంద్ర హొం మంత్రిత్వ శాఖ.
Also Read : ఆప్ చీఫ్ అనూప్ కేసరి గుడ్ బై