Motkupalli Narsimhulu : బాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత
మోత్కుపల్లి నర్సింహులు షాకింగ్ కామెంట్స్
Motkupalli Narsimhulu : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్, మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
Motkupalli Narsimhulu Comments on Jagan
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని(Chandrababu Naidu) స్పష్టం చేశారు. జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోస పోయారని ఆవేదన చెందారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏపీలో దళితులపై జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి నేతలను తీసుకు వెళ్లి జైలులో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.
వైఎస్ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదన్నారు. దళిత డ్రైవర్ ను చంపి మృత దేహాన్ని ఇంటికి తీసుకు వచ్చి అప్పగించారని మండిపడ్డారు. పులివెందులలో దళిత మహిళను రేప్ చేసి చంపారని ఆరోపించారు.
ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్ లో రూ. 7 నుంచి 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడని కితాబు ఇచ్చారు.
Also Read : AP ACB Court : బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు