Chinta Anuradha : మహిళకు నెలసరి సెలవులు ఇవ్వాలి – ఎంపీ
పార్లమెంట్ సమావేశంలో చింతా అనురాధ
Chinta Anuradha : దేశ వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెలా వచ్చే నెలసరి సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 12 ఏళ్ల వరకు బాలికలకు ఎందుకు శానిటరీ న్యాప్కిన్లు ఇవ్వడం లేదంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా డాక్టర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపించింది. ఇదే సమయంలో కోట్లాది రూపాయలు ఆదాయం పొందుతున్న ప్రభుత్వాలు ఎందుకు ఉచితంగా ప్యాడ్స్ ఇవ్వడం లేదంటూ మహిళలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం పార్లమెంట్ లో ఏపీకి చెందిన వైఎస్సార్సీపీకి చెందిన అమలాపురం చింతా అనురాధ మహిళలు ఎదుర్కొంటున్న చింతా అనురాధ(Chinta Anuradha) నెలసరి సమస్యపై నిలదీశారు. ప్రభుత్వ, ప్రైవేట్ మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యవసర అంశాలపై ఆమె ఇవాళ సభలో కేంద్ర సర్కార్ ను నిలదీశారు.
రుతుక్రమం అనేది ఒక రకంగా మహిళలకు శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. మెన్సస్ సమస్యతో బాధపడే మహిళలకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లీవ్ ల అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని అన్నారు చింతా అనురాధ.
మెన్ స్ట్రువల్ లీవ్ రూపంలో పెయిడ్ లీవ్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరారు. దీనికి పెద్ద ఎత్తున మహిళలు అభినందనలు తెలిపారు చింతా అనురాధను.
Also Read : ‘ఉంగరం’ నా విజయ రహస్యం