Shiv Raj Singh Chouhan : బాధితుడి పాదాలు క‌డిగిన సీఎం

హ్యాట్సాఫ్ శివ రాజ్ సింగ్ చౌహాన్

Shiv Raj Singh Chouhan : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌. సోది జిల్లాలో అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచురుడు దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. ఓ ద‌ళితుడిపై మూత్ర విస‌ర్జ‌న చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరాక బీజేపీ ప్ర‌భుత్వం లో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లపై దాడులు, దౌర్జ‌న్యాలు పెరిగాయ‌ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇత‌ర పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి.

ఈ సంద‌ర్భంగా మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్(Shiv Raj Singh Chouhan) పై తీవ్ర విమ‌ర్శ‌లు త‌లెత్తాయి. దీంతో ఆయ‌న ఓ సామాన్యుడిని త‌న నివాసానికి పిలిపించుకున్నారు. స‌న్మానం చేశారు. ఆపై కాళ్లు క‌డిగారు. ప్రాయ‌శ్చితం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్ వేదిక‌గా గురువారం పంచుకున్నారు.

ఇది వైర‌ల్ గా మారింది. ద‌శ‌మ‌త్ జీ ఇది మీ బాధ‌ను పంచుకునే ప్ర‌య‌త్నం చేశా. నేను కూడా మీకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాన‌ని పేర్కొన్నారు సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్. ఎవ‌రైనా స‌రే బాధితుల‌పై, పేద‌ల‌పై దాడుల‌కు దిగితే స‌హించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం.

Also Read : Bandi Sanjay : ఢిల్లీ లోనే బండి సంజ‌య్ మ‌కాం

 

Leave A Reply

Your Email Id will not be published!