MP Ranjith Reddy Case : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎంపీపై కేసు నమోదు

ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేసే సమయంలో న్యాయ సలహా తీసుకుంటామన్నారు

MP Ranjith Reddy : బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జనవరి 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారని తెలిపారు. పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావని అసభ్యకరంగా, అగౌరవ పరిచినట్టు మాట్లాడారని అన్నారు. జనవరి 20న రంజిత్ రెడ్డిపై విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MP Ranjith Reddy Case Viral

బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ఫిర్యాదును స్వీకరించారు. ఎంపీ రంజిత్ రెడ్డిపై(MP Ranjith Reddy) కేసు నమోదు చేసే సమయంలో న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన నాంపల్లిలోని 3వ ఏసీఎంఎం కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు రంజిత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఎంపీ మీద కేసులు పెట్ట‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : AP Govt : రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదించిన స్పీకర్

Leave A Reply

Your Email Id will not be published!