Sandeep Pathak : ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ కు కీలక పోస్ట్
శాశ్వత ఆహ్వానితుడిగా నియమించిన సీఎం
Sandeep Pathak : రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజ్య సభ ఎంపీ అయిన సందీప్ పాఠక్ కు కీలక పదవి అప్పగించింది. ఐఐటీ ఢిల్లీలో అసిస్టిసెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇందులో భాగంగా ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీకి శాశ్వత ఆహ్వానితుడిగా నియమించారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
రాబోయే ఎన్నికల్లో సందీప్ పాఠక్(Sandeep Pathak) కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఆయన ఇటీవల జరిగిన పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా పేరున్న ఆయనకు కీలక పదవి కట్టబెట్టినట్లు టాక్.
జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ గా నియమించారు సీఎం. ఆప్ అధికారిక ప్రకటన ప్రకారం సందీప్ పాఠక్(Sandeep Pathak) ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)కి శాశ్వత ఇన్వైటీగా ఉంటారని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జరిగిన ఎన్నికల్లో 5 సీట్లు గెలుపొందింది. దీంతో ఆ పార్టీకి జాతీయ హొదా లభించింది.
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాలను ఏర్పాటు ఏసింది. అంతే కాకుండా ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. చీపురు పుల్ల జెండాను ఎగుర వేసింది. మొత్తం 250 సీట్లకు గాను 134 సీట్లతో సత్తా చాటింది. 15 ఏళ్ల పాటు నిర్విరామంగా ఢిల్లీని పాలించిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : కాంగ్రెస్ లో కోవర్టులదే రాజ్యం