MP Sanjay Singh : మోదీ పాలనలో రాజ్యాంగానికి పాతర
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కామెంట్స్
MP Sanjay Singh : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ పాలనలో భారత రాజ్యాంగానికి భద్రత లేకుండా పోయిందన్నారు. బుధవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య వ్యవస్థను గొంతు నొక్కే పనిలో ఉండడం బాధాకరమని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
MP Sanjay Singh Comments
మోదీ కొలువు తీరిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆలోచించారా అంటూ ప్రశ్నించారు ఎంపీ. కేవలం బడా వ్యాపారుల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే పీఎంగా ఉన్నారని ప్రజల కోసం కాదన్నారు.
రాబోయే రోజుల్లో మోదీని సాగనంపడం ఖాయమన్నారు సంజయ్ సింగ్(MP Sanjay Singh). పనిగట్టుకుని ఢిల్లీ ఆప్ సర్కార్ ను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. లోక్ సభలో బీజేపీ, ఎన్డీయే సర్కార్ కు బలం ఉండవచ్చు..బిల్లుకు ఆమోదం లభించినా రాజ్యసభలో మోదీకి అంత సీన్ లేదన్నారు. అందుకే తెలివిగా తనను సస్పెండ్ చేశారంటూ మండిపడ్డారు సంజయ్ సింగ్.
దేశంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు, పార్టీలను పనిగట్టుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు ఆప్ ఎంపీ. అయినా 26 ప్రతిపక్షాలు కలిసి ఏర్పాటైన ఇండియాను ఢీకొనడం చేత కాదన్నారు. తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు సంజయ్ సింగ్.
Also Read : Arvind Kejriwal : విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం