MP Sanjay Singh : రాందాస్ కామెంట్స్ సంజయ్ సీరియస్
మణిపూర్ హింసకు మయన్మార్ కారణమా
MP Sanjay Singh : మణిపూర్ లో చోటు చేసుకున్న హింస, అల్లర్లకు మయన్మార్ ఎలా కారణం అవుతుందని ప్రశ్నించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మణిపూర్ జాతీయ అంశంగా మారిందని, దీని నుంచి ప్రజల నుంచి దారి మళ్లించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు.
MP Sanjay Singh Comments
మోడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న రాందాస్ అథవాలే సంచలన కామెంట్స్ చేశారు. మణిపూర్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న దారుణాలు, హింస, ఘటనలకు కారణం మణిపూర్ వాసులు కాదని మయన్మార్ నుంచి వచ్చిన మిలిటెంట్లు కారణమని పేర్కొన్నారు.
రాందాస్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). ఒక బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినట్లుగా లేదన్నారు. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఇలా మాట్లాడారంటూ మండిపడ్డారు.
ముందు ఈ హింసకు ప్రధాన కారకులు ఇద్దరేనని, వారు ఒకరు సీఎం బీరేన్ సింగ్ మరొకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ సంజయ్ సింగ్. మణిపూర్ ఎక్కడో లేదని, భారత దేశంలో అంతర్భాగంగా ఉందని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
Also Read : Warangal Bhadrakali Tank : తెగిన వరంగల్ భద్రకాళి చెరువు