Warangal Bhadrakali Tank : తెగిన వరంగల్ భద్రకాళి చెరువు
పోతన నగర్, సరస్వతినగర్ కు ప్రమాదం
Warangal Bhadrakali Tank : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి తెలంగాణ తల్లడిల్లుతోంది. ప్రధానంగా ఖమ్మంలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువన వస్తున్న వరద ఉధృతి ఊళ్లను దిగ్బంధంనం చేస్తోంది. ఇప్పటికే 86 కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు వరంగల్ లో. తాజాగా వరద ఉధృతి దెబ్బకు ఓరుగల్లులోని భద్రకాళి చెరువుకు(Warangal Bhadrakali Tank) గండి పడింది.
Warangal Bhadrakali Tank Damaged
దీంతో చెరువు వైపు ఉన్న కాలనీ వాసులను అప్రమత్తం చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు.
చెరువు తెగి పోయిన కారణంగా పోతన నగర్ , సరస్వతి నగర్ , కాపు వాడకు చెందిన వాళ్లంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోవాలని కోరారు. నివాస గృహాలలో ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉంది. అటు ఖమ్మం, ఇటు వరంగల్ , తదితర జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
మరో వైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుండగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.
ఇప్పటికే భద్రాచలం వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక గండి పడిన చెరువు నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
Also Read : Sanju Samson : రోహిత్ వల్లే శాంసన్ కు నో ఛాన్స్
