Sanju Samson : రోహిత్ వల్లే శాంసన్ కు నో ఛాన్స్
భగ్గుమంటున్న సంజూ ఫ్యాన్స్
Sanju Samson : విండీస్ టూర్ లో భాగంగా తొలి వన్డే జట్టుకు సంబంధించి కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో శాంసన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై లాబీయింగ్ వల్ల సంజూకు తుది జట్టులో చోటు దక్కలేదని ఆవేదన చెందారు.
Sanju Samson Issue
ఇదిలా ఉండగా చివరి దాకా శాంసన్ పేరు ఉంది. కానీ ఆఖరి నిమిషంలో వన్డే కెరీర్ లో పూర్ పర్ ఫార్మెన్స్ కలిగిన సూర్య కుమార్ యాదవ్ ను మూడో డౌన్ కు ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చకు మరింత బలం చేకూర్చేలా చేసింది. 20 ఇన్నింగ్స్ లలో సూర్య యాదవ్ సగటు రేటు 29 శాతంగా ఉండగా ఇదే సంజూ శాంసన్(Sanju Samson) కు 66 శాతం ఉంది. కనీసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు.
గణాంకాల సాక్షిగా ఏకి పారేస్తున్నారు. క్రీడా సంస్థలో చోటు చేసుకున్న లాబీయింగ్ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయంటూ ఆరోపించారు. భారత్ లో త్వరలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. కనీసం శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా లేక జట్టులో ఎంపిక చేసి బెంచ్ కే పరిమతం చేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : Harish Rao : కిరణ్..బాబు శిష్యులు కిషన్..రేవంత్
