Mr Tea Naveen Reddy : ఎవ‌రీ న‌వీన్ రెడ్డి ఏమిటా ప్రేమ క‌థ‌

మిస్ట‌ర్ టీ ఫౌండ‌ర్ క్రేజీ ల‌వ్ స్టోరీ

Mr Tea Naveen Reddy : ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది వైశాలి రెడ్డి కిడ్నాప్ వ్య‌వ‌హారం. ఒక ర‌కంగా ఫ‌క్తు సినిమా ఫ‌క్కీలో జ‌రిగింది. సినిమాను గుర్తుకు తెచ్చేలా దాడి జర‌గ‌డం, అది పోలీసుల దాకా వెళ్ల‌డం..అరెస్ట్ చేయ‌డం..కేసుల దాకా వెళ్ల‌డం..క‌ల‌క‌లం రేపింది. మొత్తంగా ఎవ‌రీ న‌వీన్ రెడ్డి అంటే మిస్ట‌ర్ టీ ఫౌండ‌ర్(Mr Tea Naveen Reddy) .

ఈ విష‌యంపై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. త‌న‌కు న‌చ్చిన వైశాలిని త‌న‌కు కాకుండా వేరే వ్య‌క్తితో పెళ్లి చేస్తున్నార‌నే కోపంతో ఈ దాడి, కిడ్నాప్ కు పాల్ప‌డ్డాడు. మ‌రో వైపు త‌న కొడుకు బంగార‌మ‌ని, ఏ పాపం తెలియ‌ద‌ని, కానీ దాడి చేయ‌డం త‌ప్పేనంటోంది న‌వీన్ రెడ్డి త‌ల్లి నారాయ‌ణ‌మ్మ‌.

డెంట‌ల్ డాక్ట‌ర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వైశాలి రెడ్డిని కిడ్నాప్ చేశాడు. ప‌ట్ట‌ప‌గ‌లు అంతా చూస్తుండ‌గానే ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 100 మందితో దాడికి పాల్ప‌డ్డాడు. యువ పారిశ్రామిక‌వేత్త‌గా పేరొందాడు. ప‌లు ఛాన‌ళ్ల‌ల్లో ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చాడు. గ‌త రెండేళ్లుగా వైశాలికి, న‌వీన్ రెడ్డికి మ‌ధ్య ల‌వ్ జ‌రుగుతోందంటున్నారు త‌ల్లి నారాయ‌ణ‌మ్మ‌.

క‌రోనా స‌మ‌యంలో వైశాలి ష‌టిల్ ఆడేందుకు వెళ్లింది. అక్క‌డి నుంచి వీరి ప‌రిచ‌యం మొద‌లై ప్రేమ‌గా మారింది. కుర్రాడు బాగున్నాడు. ఆపై వ్యాపార‌వేత్త‌గా కూడా గుర్తింపు తెచ్చు కోవ‌డంతో పెద్దలు కూడా ఓ మాట చెప్పిన‌ట్లు త‌ల్లి చెబుతోంది. సినిమాలు, షికార్లు, ఆపై విహార యాత్ర‌ల‌కు వెళ్లారు.

ఇద్ద‌రిమ‌ధ్య ఇంత జ‌రిగినా ఏమైందా ఏమో కానీ వైశాలి రెడ్డి పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇద్ద‌రూ మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. దీంతో వైశాలి రెడ్డి కూడా పెళ్లికి నో చెప్పింది. కానీ ఆ మాట‌ను పాజిటివ్ గా తీసుకోలేదు న‌వీన్ రెడ్డి(Mr Tea Naveen Reddy) . ప్ర‌తీకారంతో ర‌గిలి పోయాడు. వైశాలి ఇంటి ముందు ఉన్న స్థ‌లాన్ని లీజుకు తీసుకున్నాడు.

గ్లాస్ హౌస్ క‌ట్టుకున్నాడు. ఇదే స‌మ‌యంలో న‌వీన్ రెడ్డిపై వైశాలి రెడ్డి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. పోలీసులను ఏదో విధంగా మ్యానేజ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైశాలి రెడ్డి మెజిస్ట్రేట్ ఎదుట త‌మ కుటుంబీకుల‌కు ఆ పెళ్లి ఇష్టం లేద‌ని చెప్పింది.

వారిపై న‌వీన్ రెడ్డి మండిప‌డ్డాడు. ఆపై కిడ్నాప్ కు పాల్ప‌డ్డాడు. న‌ల్లగొండ జిల్లా నుంచి విజ‌య‌వాడ కు పారిపోతుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ క‌థకు స్క్రీన్ ప్లే, మాట‌లు, క‌థ , హీరో అన్నీ న‌వీన్ రెడ్డే కావ‌డం విశేషం.

Also Read : మ‌లుపు తిరుగుతున్న వైశాలి కిడ్నాప్ కేసు

Leave A Reply

Your Email Id will not be published!