MS Dhoni : ఎంఎస్ ధోనీకి గ్రాండ్ వెల్ కమ్
ఎల్జీఎం మూవీ ట్రైలర్ లాంచ్
MS Dhoni : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి చెన్నైకి చేరుకున్నారు. సోమవారం తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన లెట్స్ గెట్ మ్యారీడ్ మూవీ (ఎల్జీఎం)కి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ధోనీకి పెద్ద ఎత్తున అభిమానులు సాదర స్వాగతం పలికారు.
ధోనీకి లెక్కించ లేనంత ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ రంగంలో అత్యంత విలువైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు ధోనీ. ఆయనతో పాటు ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కూడా పోటీ పడుతున్నాడు. రూ. 1,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది పక్కన పెడితే ఎంఎస్ ధోనీకి(MS Dhoni) లెక్కించ లేనంత మంది ఫ్యాన్స్ కలిగి ఉన్నాడు. ప్రముఖ భారతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ కంపెనీల ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది కెప్టెన్ కు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు ధోనీ. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దు కోవాలనే ఆలోచనతో ధోనీతో పాటు భార్య కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం విశేషం. ధోనీ తొలి సినిమా తమిళలంలో తెరకెక్కుతోంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే భారీ ఎత్తున మార్కెట్ కలిగి ఉండడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఏమైనా ధోనీనా మజాకా అంటున్నారు అభిమానులు.
Also Read : kuchukulla Damodar Reddy : గులాబీకి కూచుకుళ్ల గుడ్ బై