MS Dhoni Comment : మహేంద్ర సింగ్ ధోనీ. అతడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా ఎదిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండానే స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగాడు. భారత క్రికెట్ కు ఎనలేని విజయాలు సాధించి పెట్టాడు.
తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. తానేమిటో తన పవర్ ఏమిటో కేవలం ఆట ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఎక్కడా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్ట పడని ఈ డైనమిక్ బ్యాటర్ ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.
అన్ని ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం డబ్బులు పోగేసుకునే పనిలో పడ్డాడు. తాజాగా ఈ జార్ఖండ్ డైనమెట్ హాట్ టాపిక్ గా మారాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాడు.
కారణం ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెట్ జట్టుకు ప్రధానంగా దానిని నియంత్రించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు ఉన్నంత ప్రయారిటీ దేనికీ, ఏ దేశానికి ఉండదు.
ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని నియంత్రిచేది ఒక్క బీసీసీఐనే. భారత జట్టు(Team India) ఎక్కడ ఆడితే , ఎవరితో ఆడితే ఆ జట్లకు కాసులు కురుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సాధికారత సంస్థల్లో టాప్ మూడింట్లో ఒకటిగా గుర్తింపు పొందింది బీసీసీఐ.
ఇప్పుడు బీసీసీఐ ఏది చెబితే అది వేదం. ఇప్పటి వరకు బీసీసీఐకి గంగూలీ చీఫ్ గా ఉండేవాడు. కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నాడు. ఆపై రోజర్ బిన్నీ ఎన్నికయ్యాడు. కానీ మొత్తం బీసీసీఐ ప్రస్తుతం కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా కనుసన్నలలోనే నడుస్తోంది.
ఇదిలా ఉండగా భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రెగ్యులర్ సీరీస్ లలో సత్తా చాటినా ఐసీసీ టోర్నీలలో చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది.
అప్పటి వరకు కోహ్లీ ఏడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అతడి ట్రాక్ , సక్సెస్ రికార్డు బాగానే ఉంది. కానీ గంగూలీకి నచ్చలేదు. ఇదే సమయంలో ధోనీ(MS Dhoni) నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాక రవిశాస్త్రి హెడ్ కోచ్ వచ్చాక ఇద్దరి కాంబినేషన్ కుదిరింది.
దుబాయ్ వేదికగా కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత రవి శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా నియమించింది. కానీ ఆశించిన మేర రిజల్ట్స్ రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానంగా ఇటీవల ఆసిస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సెమీస్ లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో రాహుల్
ద్రవిడ్ ను తప్పిస్తారని ధోనీకి పగ్గాలు అప్ప గిస్తారని ప్రచారం జరుగుతోంది. ధోనీ మెంటార్ గా ఉన్న జట్టు గెలవలేక పోయింది.
పాకిస్తాన్ తో 10 వికెట్ల తేడాతో పరువు పోగొట్టుకుంది. కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తలు, కంపెనీలు శాసిస్తున్న ఈ తరుణంలో ధోనీ వచ్చినా లేదా ఇంకొకరు ఉన్నా జట్టులో మార్పులంటూ ఉండవన్న ఆరోపణలు ఉన్నాయి. ద్రవిడ్ ను కొనసాగిస్తూనే టి20 ఫార్మాట్ కు ధోనీని తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read : టి20 ర్యాంకింగ్స్ లో సూర్య..హసరంగ టాప్