MS Dhoni Lap Of Honour : క్రికెట్ యోధుడికి అరుదైన గౌర‌వం

చెన్నై చెపాక్ స్టేడియంలో జేజేలు

ఇది ఊహించ‌ని ప‌రిణామం. క్రికెట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇండియ‌న్ ప్రీమీయ‌ర్ లీగ్ నుంచి నిష్క్ర‌మించ‌నున్నాడా. ఇదే సంకేతం అనుకోవాలా. ఆదివారం చెన్నై లోని చెపాక్ స్టేడియంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో సీఎస్కే ఓడి పోయింది. కానీ ప్లే ఆఫ్ రేసులో ఉంది. గ‌త కొంత కాలంగా సీఎస్కేకు గుడ్ బై చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు త‌న మ‌దిలోని మాట‌ను వెల్ల‌డించాడు ధోనీ.

అయితే చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ త‌మ జ‌ట్టుకు ఆయ‌నే సార‌థి అని ప్ర‌క‌టించింది. గ‌త సీజ‌న్ లో అర్ధాంత‌రంగా ర‌వీంద్ర జ‌డేజాను త‌న వార‌సుడిగా ప్ర‌క‌టించాడు. కానీ ఆశించిన మేర రాణించ లేదు. దీంతో చివ‌ర‌కు మ‌ళ్లీ ఎంఎస్ ధోనీనే నాయ‌కత్వం వ‌హించినా ఫ‌లితం లేక పోయింది. ప్లే ఆఫ్ కు చేర‌కుండానే వెనుదిరిగింది.

తాజాగా ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో మాత్రం ఆరంభంలో త‌డ‌బాటుకు గురైనా ఆ త‌ర్వాత అద్భుత‌మైన రీతిలో ప్ర‌ద‌ర్శ‌న చేసింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంత‌రం ధోనీ స్టేడియం అంతా క‌లియ తిరిగాడు. ఈ దిగ్గ‌జ ఆట‌గాడికి గౌర‌వ వంద‌నం చేసింది. స్టేడియం ధోనీ పేరుతో ద‌ద్ద‌రిల్లి పోయింది. మ‌రో లివింగ్ లెజెండ్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ అయితే ప‌రుగులు తీసుకుంటూ ధోనీ వ‌ద్ద‌కు వెళ్లాడు. అత‌డి ష‌ర్ట్ పై ధోనీ సంత‌కం తీసుకున్నాడు. ఇది ధోనీకి ఉన్న విలువ‌. మొత్తంగా ధోనీ ఆట ఇక క‌నిపించ‌దా అన్న అనుమానం ఫ్యాన్స్ ల‌లో నెల‌కొంది.

Leave A Reply

Your Email Id will not be published!