MS Dhoni Emotional : అభిమాన సంధ్రం ధోనీ భావోద్వేగం

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం

MS Dhoni Emotional : త‌న సార‌థ్యంలో మ‌రోసారి ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచేలా చేశాడు చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క ఫైన‌ల్ లో 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ను మ‌ట్టి క‌రిపించాడు. దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ ధోనీని స్మ‌రించారు.

దాయాది దేశం పాకిస్తాన్ లో సైతం ఫ్యాన్స్ హోరెత్తి పోయారు. పొట్టి ఫార్మాట్ లో త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. వ‌య‌సు మీద ప‌డినా వ్య‌క్తిగ‌తంగా రాణించ లేక పోయినా ఎంఎస్ ధోనీ మాత్రం నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు.

జ‌ట్టును ఎంపిక చేసుకోవ‌డం ద‌గ్గ‌రి నుంచి టైటిల్ గెలిచే దాకా ఎక్క‌డా భావోద్వేగాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించ నీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. అందుకే ధోనీని అంతా మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ అంటారు. ఐపీఎల్ లీగ్ ప‌రంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌లో జ‌రిగిన మ్యాచ్ ల‌లో ధోనీ గెలిచినా లేదా ఓడి పోయినా ఫ్యాన్స్ ప్రాంతాల‌కు అతీతంగా ఆరాధించ‌డం మొద‌లు పెట్టారు.

అంతే కాదు ఐపీఎల్ నుంచి త‌ప్పుకుంటాడ‌ని అంతా భావించారు. ఈ స‌మ‌యంలో త‌న‌ను ఆరాధించే అభిమానుల ఉత్సాహాన్ని, ఆద‌ర‌ణ‌ను చూసి చ‌లించి పోయాడు జార్ఖండ్ డైన‌మెంట్. తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : Mohit Sharma

 

Leave A Reply

Your Email Id will not be published!