మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వెరీ వెరీ స్పెషల్. ఎక్కువగా మాట్లాడటం ఇష్ట పడని ఈ స్కిప్పర్ ఏది చేసినా సంచలనమే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా ఉన్నాడు. ఇక తమిళనాడుకు చెందిన ఏనుగు సంరక్షకులు బొమ్మన్ , బెల్లీలు ఒకే ఒక్క సినిమాతో స్టార్లు గా మారి పోయారు. వారు నటించిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఓ వైపు ఆర్ఆర్ఆర్ మాయలో జనం పడినా ఎక్కడా తమకు తాముగా ప్రచారం చేసుకోలేదు బొమ్మన్ బెల్లీ టీం.
దర్శకురాలు కార్తీకి గొన్సాల్వేస్ ఎంతో కష్టపడి ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ ఫిలింను చిత్రీకరించింది. ఒక రకంగా బిగ్ ఫీట్ సాధించింది. చివరకు అత్యుత్తమమైన ఆస్కార్ ను స్వంతం చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది ది ఎలిఫెంట్ విష్పరర్స్ నటులు, దర్శకురాలిని.
ఇదే సమయంలో చెన్నై కెప్టెన్ , జార్ఖండ్ డైనమెట్ చెన్నై లోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కంటే ముందు బొమ్మన్ , బెల్లీ, దర్శకురాలిని అభినందించారు. వారికి అభివందనం చేశాడు ధోనీ. అంతే కాదు తాను ఇష్టంగా ధరించే 7వ నంబర్ జెర్సీని బొమ్మన్, బెల్లీకి అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
