MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ అలియాస్ ఝార్ఖండ్ డైనమెట్. భారత క్రికెట్ జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టిన అరుదైన క్రికెటర్. అద్భుతమైన సారథి కూడా. తనతో పాటు ఆడిన వాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తే తాను మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు.
సుదీర్ఘ కాలం పాటు ఐపీఎల్ లో ఆడుతూ వస్తున్నాడు. అంతేనా చెన్నై సూపర్ కింగ్స్ కు 2021 ఐపీఎల్ దాకా కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టుకు అనూహ్యంగా టైటిల్ తీసుకు వచ్చాడు.
కానీ ముంబై వేదికగా జరుగుతున్న 2022 ఐపీఎల్ రిచ్ లీగ్ లో సీఎస్కే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తన స్థానంలో జడ్డూ అలియాస్ రవీంద్ర జడేజాకు అప్పగించేలా ప్లాన్ చేశాడు. అదే నడుస్తోంది.
కానీ ఊహించని రీతిలో ఇప్పటి వరకు వరుసగా ఆ జట్టు 5 మ్యాచ్ లు ఓడి పోయింది. కానీ తర్వాత పుంజుకుంది. రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. తాజాగా ముంబై వేదికగా జరిగిన సమ ఉజ్జీల పోరాటంలో సీఎస్కేకు తానే ముందుండి గెలుపు అందించాడు.
తనలో ఇంకా శక్తి అలాగే ఉందని చాటాడు. 156 పరుగుల స్వల్ప లక్ష్యం. అయినా చెన్నై తడబడింది. ఆఖరున మైదానంలోకి వచ్చాడు ఈ డైనమెట్. ఒకే ఒక్క ఓవర్. అది లాస్ట్ ఓవర్.
ఇక 20వ ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 17 పరుగులు చేయాలి. ఆరు బంతులు. బౌలర్ ఉనాద్కత్. ఉన్నది మ్యాచ్ ను మార్చగలిగే సత్తా ఉన్నోడు ధోనీ(MS Dhoni). ఇంకేం ఓ వైడ్ వచ్చింది.
ఆ తర్వాతి బంతిని సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టాడుం. ఇంకేం చెన్నై జయకేతనం ఎగుర వేసింది. ముంబై పరాజయ పరంపర కొనసాగిస్తూ ఆఖరున నిలిచింది. మొత్తంగా ధోనీ తాను ఫినిషర్ ను అని నిరూపించుకున్నాడు.
Also Read : ఈ అవార్డు పటేల్ తో పంచుకుంటా